అన్వేషించండి

Cm Kcr: కార్పొరేషన్లకు ఛైర్మన్లను ఖరారు చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణలో పలు కార్పొరేషన్లకు సీఎం కేసీఆర్ ఛైర్మన్లను ఖరారు చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్‌ను నియమించారు.

సీఎం కేసీఆర్ తెలంగాణలోని పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను ఖరారు చేశారు. తెలంగాణ ఉమెన్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా గజ్జెల నగేశ్‌, స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ ఛైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్‌రావును సీఎం కేసీఆర్ నియమించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్‌, షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లను నియమించారు. కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల చేయనున్నారు. ఇటీవలే మూడు కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా, టీఆర్ఎస్ సామాజిక విభాగం నేత మన్నె క్రిశాంక్‌ను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా, టీఆర్ఎస్ ధూంధాం కళాకారుడు, గాయకుడు వేద సాయిచంద్‌ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మరికొన్ని కార్పొరేషన్ల ఛైర్మన్లను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. 

Also Read:  20న కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు - పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఆదేశం !

దశల వారీగా దళిత బంధు

తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షత‌న‌ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం జరిగింది. ధాన్యం కొనుగోళ్లు, గ‌నుల ప్రైవేటీక‌ర‌ణ‌, ఇత‌ర అంశాల‌పై సీఎం పార్టీ శ్రేణులతో చ‌ర్చించారు. కేంద్రంపై పోరులో భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ‌పై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఎమ్మెల్యేల‌తో సీఎం సమావేశమయ్యారు. రైతుబంధు పథకం కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇత‌ర పంట‌లు వేసేలా రైతులకు సూచించాలన్నారు. ద‌ళిత బంధుపై విప‌క్షాల ప్రచారం తిప్పికొట్టాలని, దళిత బంధును ద‌శ‌ల వారీగా రాష్ట్రమంతా అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. నిరంత‌రం ప్రజ‌ల్లో ఉండాల‌ని కేసీఆర్ ఎమ్మెల్యేల‌కు సూచించారు. 

Also Read: కరోనా కాలం చదవులా ? ఇంటర్ బోర్డు పొరపాటా? వివాదంగా మారిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు !

20వ తేదీన కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు

భారతీయ  జనతా  పార్టీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల ఇరవయ్యో తేదీన తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శలు చేపట్టాలని దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.  తెలంగాణ భ‌వ‌న్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల విస్తృత స్థాయి సమావేశంర జరిగింది. ఈ సమావేశంలో  పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని రైతులకు తెలియ చెప్పాలని పార్టీ నేతలను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ధాన్యం కొనుగోలు కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. శనివారం ఢిల్లీకి మంత్రుల బృందాన్ని కూడా పంపుతున్నామని కేసీఆర్ తెలిపారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణ అంశంపైనా కేంద్రం తీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇత‌ర పంట‌లు వేసేలా రైతుల్లో చైత‌న్యం తేవాల‌ని సూచించారు.  వరి రైతులకు రైతు  బంధు పథకం ఇవ్వరని జరుగుతున్న ప్రచారం కారణంగాఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.  ద‌ళిత బంధుపై విప‌క్షాల ప్రచారం తిప్పికొట్టాలని ఆదేశించారు.  ఈ ప‌థ‌కాన్ని ద‌శ‌ల వారీగా రాష్ట్రమంతా అమ‌లు చేస్తామ‌ని స్పష్టం చేశారు. 

Also Read: హెల్మెట్, మిర్రర్స్ లేవా పుష్ప... సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget