అన్వేషించండి

Telangana Cabinet decisions: హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి తెలంగాణ కేబినెట్ ఓకే - ఎల్ అండ్ టీ నుంచి ఇక ప్రభుత్వం చేతుల్లోకి !

Hyderabad Metro takeover: హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి తెలంగాణ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఎల్ అండ్ టీ నుంచి పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి రానుంది.

Telangana Cabinet approves Hyderabad Metro takeover: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన  జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ మెట్రో   భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎల్ అండ్  సంస్థ ఆధ్వర్యంలో ఉన్న మెట్రో ఫేజ్-1 నిర్వహణను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం  చేసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా, అంటే మార్చి 31, 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఐడీబీఐ  అందించిన ఆర్థిక నివేదికలు, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇచ్చిన సాంకేతిక నివేదికలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలనే నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఎల్ అండ్ టీ సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక భారంతో పాటు, మెట్రో రెండో దశ  విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు ఈ అడుగు పడింది. మెట్రో ఫేజ్-1 ప్రైవేటు సంస్థ చేతుల్లో ఉండటం వల్ల, ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే రెండో దశ విస్తరణకు కేంద్రం నిధులు కేటాయించడంలో జాప్యం చేస్తోంది. ఈ అడ్డంకిని తొలగించడంతో పాటు, భవిష్యత్తులో మెట్రోను లాభదాయకంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ స్వాధీన ప్రక్రియలో భాగంగా ఎల్ అండ్ టీ సంస్థకు సంబంధించి సుమారు రూ.13,000 కోట్ల రుణాలను ప్రభుత్వం స్వీకరించనుంది. అలాగే ఆ సంస్థ పెట్టిన పెట్టుబడికి  ప్రతిఫలంగా సుమారు రూ.2,000 కోట్లను వన్-టైమ్ సెటిల్‌మెంట్ కింద చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. దీనివల్ల హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పూర్తి ప్రభుత్వ రంగ సంస్థగా మారి, విదేశీ ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. కేవలం రవాణా వ్యవస్థగానే కాకుండా, మెట్రో ఆస్తుల వినియోగం ద్వారా ఆదాయం పెంచుకునేలా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

మెట్రో నిర్ణయంతో పాటు, కేబినెట్ మరికొన్ని కీలక అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపింది. ముఖ్యంగా ముసి నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులకు అందజేసే నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీలపై సుదీర్ఘంగా చర్చించారు.  

 

టాప్ హెడ్ లైన్స్

Akhil Raj: ఫుడ్ డెలివరీ బాయ్‌పై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో దాడి... అఖిల్ రాజ్ వీడియో వైరల్
ఫుడ్ డెలివరీ బాయ్‌పై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో దాడి... అఖిల్ రాజ్ వీడియో వైరల్
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
Musi River Cleaning Execution Deadline: మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
Nerve Weakness : నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Embed widget