అన్వేషించండి

Telangana Breakfast Scheme: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా

తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఉచిత అల్పాహారం, పాలు అందించే పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. లెక్చరర్లు, టీచర్లకు కూడా మధ్యాహ్న భోజనం విస్తరించనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణ ప్రభుత్వం ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్ వరకు అల్పాహారం ఆమోదించింది.
  • 2026-27 నుండి రూ.925.41 కోట్లతో పథకం అమలుకు అనుమతి.
  • ప్రీ-ప్రైమరీ, ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక అల్పాహారం, పాలు, రాగిజావ.

హైదరాబాద్: ప్రభుత్వ విద్యాసంవత్సరాల్లో ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు తెలంగాణ మంత్రిమండలి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రీ-ప్రైమరీ క్లాస్ నుంచి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులందరికీ ఉదయం పూట అల్పాహారాన్ని అందించే తెలంగాణ అల్పాహార పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమలవుతుండగా, ఇకపై దానికి అదనంగా ఉదయం పూట అల్పాహారం, పాలను కూడా పంపిణీ చేయనున్నారు. ఈ పథకాన్ని ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు కూడా వర్తింపజేయడంతో పాటు, మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని విద్యార్థులతో పాటు అక్కడే పనిచేసే టీచర్లు, లెక్చరర్లకు సైతం కల్పించారు. 

రూ.925.41 కోట్ల భారీ బడ్జెట్ కేటాయింపు
 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖకు రూ.733.46 కోట్లు, ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్‌కు రూ.191.95 కోట్లు చొప్పున కలిపి మొత్తం రూ.925.41 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ పథకం కింద ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు చదివే చిన్న పిల్లలకు రోజుకు 75 గ్రాములు, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు 100 గ్రాముల చొప్పున అల్పాహారాన్ని అందిస్తారు. 

పాఠశాల విద్యార్థుల నిధుల వివరాలు
ఒక విద్యాసంవత్సరంలో స్కూల్ విద్యార్థులకు మొత్తం 230 రోజుల పాటు అల్పాహారం, 115 రోజుల పాటు కాచిన పాలను అందిస్తారు. ఇందులో భాగంగా, 1వ తరగతి (ప్రీ-ప్రైమరీ) నుంచి 5వ తరగతి వరకు చదివే 9,24,124 మంది విద్యార్థులకు రోజుకు ఒక్కొక్కరికి రూ.11.50 చొప్పున ఏడాదికి రూ.244.43 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే, 6 నుంచి 10వ తరగతి చదివే 9,11,233 మందితో పాటు మోడల్ స్కూళ్లలో ఇంటర్ చదువుతున్న 22,559 మంది విద్యార్థుల అల్పాహారం కోసం రోజుకు రూ.13.50 చొప్పున రూ.289.63 కోట్లు కేటాయించారు. పాఠశాలల్లో పాలు ఇచ్చే కార్యక్రమానికి అదనంగా రూ.199.4 కోట్లు ఖర్చు చేయనున్నారు.

Also Read: Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. టీచర్లకూ మధ్యాహ్న భోజనం - మూసీ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

ఇంటర్ విద్యార్థుల కోసం ఏడాదికి రూ.9,875 ఖర్చు
ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న 1,94,375 మంది విద్యార్థులకు విద్యాసంవత్సరంలో 220 రోజులు అల్పాహారం, 110 రోజులు పాలు, మరో 110 రోజులు బలవర్ధకమైన రాగిజావను ప్రభుత్వం అందించనుంది. బ్రేక్ ఫాస్ట్‌ కోసం రూ.2,970, పాలకు రూ.1,144, రాగిజావకు రూ.231 చొప్పున.. కేవలం ఉదయపు పోషకాహారం కోసమే ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.4,345 ఖర్చు కానుంది. వీరికి మధ్యాహ్న భోజనానికి అయ్యే రూ.4,367, ఇతర ఖర్చులతో కలిపి రూ.5,530 అవుతుంది. మొత్తంగా ఇంటర్ చదివే ఒక్కో విద్యార్థి అల్పాహారం, పాలు, రాగిజావ, మధ్యాహ్న భోజనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రూ.9,875 చొప్పున భారీగా ఖర్చు చేయనుంది.

విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ మెను వివరాలు..
- సోమవారం : రెండు దోశలు, చట్నీ
- మంగళవారం : రెండు మిల్లెట్ ఇడ్లీలు, సాంబారు
- బుధవారం : రెండు పూరీలు, మిక్స్‌డ్ వెజ్ కర్రీ
- గురువారం : రెండు బోండాలు, చట్నీ
- శుక్రవారం : రెండు ఇడ్లీలు, చట్నీ
- శనివారం : ఉప్మా, సాంబారు లేదా ఉప్మా, చట్నీ

 

Frequently Asked Questions

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకం ఏమిటి?

తెలంగాణ అల్పాహార పథకం పేరుతో ప్రభుత్వ విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం, పాలు అందించనున్నారు. ఇది ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు వర్తిస్తుంది.

ఈ పథకం ద్వారా ఏ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది?

ప్రీ-ప్రైమరీ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులందరికీ ఈ అల్పాహార పథకం వర్తిస్తుంది. టీచర్లు, లెక్చరర్లకు కూడా మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు.

ఈ పథకం ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది మరియు బడ్జెట్ ఎంత?

ఈ పథకం 2026-27 విద్యాసంవత్సరం నుండి అమలు చేయబడుతుంది. దీని కోసం ప్రభుత్వం మొత్తం రూ.925.41 కోట్లు కేటాయించింది.

విద్యార్థులకు ఎంత అల్పాహారం అందిస్తారు?

ప్రీ-ప్రైమరీ నుండి ఐదో తరగతి వరకు రోజుకు 75 గ్రాములు, 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు రోజుకు 100 గ్రాముల చొప్పున అల్పాహారం అందిస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget