By: ABP Desam | Updated at : 12 Dec 2021 01:09 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
బండి సంజయ్ (Source : Bandi sanjay Twitter)
టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరడం సంతోషమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వారందరికీ హృదయపూర్వకంగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నామన్నారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే ధైర్యం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. టీఆర్ఎస్ గడీలను బద్దలు కొట్టే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. రాబోయే ఎన్నికల్లో కల్వకుర్తి అసెంబ్లీలో ఎగరబోయేది కాషాయ జెండా అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, డ్రగ్స్ మాఫియాతోపాటు ఇప్పుడు వైన్స్ మాఫియా స్టార్ట్ అయిందని బండి సంజయ్ ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లోకి వెళ్లి వైన్స్ షాపులు పెట్టించి డబ్బు దండుకుంటున్నారని విమర్శించారు.
Also Read: జగన్ హామీ నెరవేరలేదు.. పైగా జైలు పాలయింది..! టీటీడీ పారిశుద్ధ్య కార్మికులు రాధ దీన స్థితి...
రాష్ట్రంలో కొత్త స్కీంలు
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మూడు కొత్త స్కీంలు స్టార్ట్ చేశారని బండి సంజయ్ విమర్శించారు. తాగు-తాగించు, ఊగు-ఊగించు, దంచుకో-దుండుకో పథకాలను ప్రవేశపెట్టారని ఎద్దేవా చేశారు. ఈ మూడు పథకాలతో డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. డబ్బుతో ఓట్లు కొనాలనుకున్న కేసీఆర్ ను హుజూరాబాద్ ప్రజలు చిత్తుగా ఓడించారన్నారు. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యంతోనే మెదక్ జిల్లాలో రైతు చనిపోయాడన్నారు. వానా కాలం పంట కొనకుండా రైతులను కేసీఆర్ గోస పెడుతున్నారన్నారు. ఎక్కడా లేని విధంగా వరికుప్పల మీద పడి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. సమస్యలను సృష్టించి టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల దృష్టిని మళ్లించడంలో కేసీఆర్ నెంబర్ వన్ అని బండి సంజయ్ ఆరోపించారు.
Also Read: మాస్క్ లేని వారిని రానిస్తే వ్యాపార సంస్థల మూసివేత..ఏపీ ప్రభుత్వ కొత్త కోవిడ్ రూల్స్ !
మంత్రులకు అధికారాలు లేవు
చైనా విషయంలో సైనిక వీరుడు బిపిన్ రావత్ ఎంతగా తెగించి కొట్లాడిండో సీఎం కేసీఆర్ తెలుసుకోవాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు రావత్ గురించి చైనా దుష్ప్రచారం చేస్తోందన్నారు. రాత్రి పూట నిర్ణయాలు తీసుకునే సీఎం కేసీఆర్ ఒక్కరే ఉన్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు ఉండవన్నారు. హోంగార్డును కూడా బదిలీ చేయలేని వ్యక్తి హోంమంత్రిగా కొనసాగుతున్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలోనే అధికారాలన్నీ ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టడం బీజేపీతోనే సాధ్యమని బండి సంజయ్ అన్నారు. వచ్చే కల్వకుర్తి ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురుతుందన్నారు.
Also Read: 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం... టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Telangana Elections 2023 Live News Updates: కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్- విచారణకు ఆదేశం
Telangana CM KCR Vote: రేపు చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకోనున్న సీఎం కేసీఆర్
Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
Telangana Elections 2023 : ఫుల్ స్వింగ్లో బెట్టింగ్ బంగార్రాజులు - సొంత సర్వేలతో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పందేలు !
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!
Singanamala Politics: ఏపీలో ఈ నియోజకవర్గం చాలా స్పెషల్! ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం, ఇదే చంద్రబాబుకి తలనొప్పి!
Bigg Boss Telugu 7: గౌతమ్కు ప్రియాంక సపోర్ట్ - వెధవను అయిపోయాను అంటూ అమర్ సీరియస్
/body>