Breaking News Live: అసెంబ్లీలో కేసీఆర్ ఉద్యోగుల ప్రకటనపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన అల్పపీడనం ప్రభావం నిన్నటితో తగ్గింది. నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో వేడి అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం తీరం దాటడంతో తమిళనాడుతో వాతావరణం నేడు సైతం చల్లగా ఉంటుంది. తీరం వెంట చలి గాలులు ప్రభావం చూపుతాయి.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఎండ వేడి మధ్యాహ్నం కొనసాగుతోంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాయువ్య దిశ నుంచి బలమైన గాలులు (Southeasterly winds prevail over Andhra Pradesh) వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పగటి పూట ఎండ ఎక్కువగా ఉండటంతో వాతావరణంలో ఉక్కపోత అధికం అవుతుంది. మరోవైపు రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. బాపట్లలో 20 డిగ్రీలు, కాకినాడలో 22.5 డిగ్రీలు ,కళింగపట్నంలో 20.2 డిగ్రీలు, నందిగామలో 21.2 డిగ్రీలు, నెల్లూరులో 24.6 డిగ్రీలు, తునిలో 22.5 డిగ్రీలు, విశాఖపట్నంలో 21.2 డిగ్రీలు, అమరావతిలో 21.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణం నేడు పొడిగా మారుతుంది. మార్చి 12 వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో వేడి, ఉక్కపోత కొనసాగుతోంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఎండ మండిపోతోంది. నంద్యాలలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రానున్న మూడు రోజుల దాక ఇలాగే కొనసాగనుంది. ఆరోగ్యవరం, అనంతపురంలో కొన్ని చోట్ల చలిగాలులు వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఆరోగ్యవరంలో 29 డిగ్రీలు ఉండగా, రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రత 17.5 డిగ్రీలు నమోదైంది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడం జిల్లాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉండనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మార్చి 13 నుంచి వడగాల్పులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 33, 34 డిగ్రీల మేర నమోదు అవుతున్నాయి.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) కాస్త నిలకడగా ఉంది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరుగుతున్న సంగతి తెలిసిందే. వెండి ధర నేడు కాస్త తగ్గింది. కిలోకు ఏకంగా రూ.1,100 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.49,400 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.53,890 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.74,600 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,700గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.74,600 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.49,400 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.53,890గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.74,600 గా ఉంది.
Gun Fire In Siddipeta: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో కాల్పులు కలలం
సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో కాల్పులు కలలం
చెల్లాపూర్‌లోని వాగుగడ్డ వద్ద కాల్పులు
వంశీ అనే వ్యక్తిపై కాల్పులు జరిపిన దుండగులు ట
ఒగ్గు తిరుపతి వర్గీయులే చేసి ఉంటారని అనుమానం
సిద్దిపేట నుంచి హైదరాబాద్ బైక్ వస్తుండగా కాల్పులు
తిరుపతి, వంశీ వర్గీయుల మధ్య ఎప్పటి నుంచో వివాదం
భూతగాదాల నేపథ్యంలో కాల్పులు జరిగినట్టు అనుమానం
గతంలో కత్తిపోట్లు ఘటనలో కేసు
ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్న ఎస్పీ శ్వేత
కేసీఆర్ నిర్ణయం భేష్: జేసీ దివాకర్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉద్యోగాల పై చేసిన ప్రకటనపై మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ‘‘ఒకేసారి ముఖ్యమంత్రి 91 వేల ఉద్యోగాల గురించి చెప్పడం చరిత్రలో మొదటి సారి అనుకుంటా. దేశంలోనే ఎక్కడ ఎలా జరగలేదు. కచ్చితంగా యూత్ లో ఒక క్రేజ్ వస్తుంది. పొలిటికల్ ఇంపాక్ట్ కూడా ఈ స్టేట్మెంట్ వల్ల వస్తుంది. మా ఆంధ్రలో అసలు డబ్బులే లేవు. జీతలకే డబ్బులు లేవు ఆంధ్రప్రదేశ్ లో. జగన్ మూడు రాజధానులను వదిలేసినట్లే కనిపిస్తుంది. అందుకే బొత్స హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాడ’’ని అన్నారు.
‘‘సీఎంలను కలిసేందుకు ఒకప్పటిలా లేదు. ఇప్పుడు సీఎంలను కలవాలంటే ఆశామాశషీగా లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలుద్దామని వెళ్లినా వీలు కాలేదు. అపాయింట్ మెంట్ ఓకే అయితే పిలుస్తామన్నారు. ఇప్పటి దాకా లేదు. ఏపీలో అయితే మంత్రులకే సీఎం అపాంట్ మెంట్ ఉండటం లేద’’ని అయన వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఉద్యోగ ఖాళీల ప్రకటనపై జీవన్ రెడ్డి ఆగ్రహం
ఉద్యోగాల భర్తీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏర్పడిన ఖాళీలు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం హస్యాస్పదం అని అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బిశ్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికలో తెలంగాణలో1.91 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని.. ఇప్పుడు కేవలం 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. వారికి ఈ ప్రకటన ఏ మాత్రం ప్రయోజనం చేకూరదని అన్నారు.
Telangana Assembly Session: అసెంబ్లీ సమావేశాలు లైవ్
రాజకీయాలంటే మాకు పవిత్రమైన పని: తెలంగాణ సీఎం కేసీఆర్
రాజకీయాలంటే మాకు పవిత్రమైన పని: తెలంగాణ సీఎం కేసీఆర్
దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. మాకు రాజకీయాలంటే పవిత్రమైన కర్తవ్యం, ఉద్యమం సమయంలో ఏం చేశామో రాష్ట్ర ప్రజలు గమనించారు. టీఆర్ఎస్ నేతలు సైతం కేసులు ఎదుర్కొన్నారు. జైళ్లకు వెళ్లారు. వారిపై ఇంకా కేసులు ఉన్నాయని అసెంబ్లీలో కేసీఆర్ పేర్కొన్నారు.