Breaking Updates Live: తెలంగాణలో కొత్తగా 245 పాజిటివ్ కేసులు.. జీహెచ్ఎంసీలో 73 మందికి కరోనా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 29న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 29న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
తెలంగాణలో కొత్తగా 245 పాజిటివ్ కేసులు.. జీహెచ్ఎంసీలో 73 మందికి కరోనా
తెలంగాణలో 52,683 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 245 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 73 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 6,65,749కు చేరింది. అందులో 6,57,213 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో తాజాగా ఒకరు చనిపోగా, మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,916కు చేరింది.
ఆ క్రిమినల్ గ్యాంగ్‌లపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి: తెలంగాణ డీజీపీ
సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే నేరస్తుల ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించి, వారి అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారు, అలవాటుగా నేరాలకు పాల్పడే వారిపై పి.డి. యాక్టులు నమోదు చేసి నిందుతులకు శిక్ష పడేలా కఠినంగా వ్యవహరించాలని డీజీపీ సూచించారు.





















