Breaking News Live: జగనన్న తోడు కార్యక్రమం బుధవారానికి వాయిదా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 18న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 18న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
దళిత బంధు కింద రూ.250 కోట్లు విడుదల
దళితుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకం కోసం సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిధుల విడుదల ఉత్తర్వులు జారీ చేశారు. రూ.100 కోట్ల నిధులను ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి, రూ. 50 కోట్లను సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలానికి, రూ. 50 కోట్లు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాలలోని చారగొండ మండలానికి, రూ.50 కోట్లు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలానికి నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జగనన్న తోడు కార్యక్రమం బుధవారానికి వాయిదా
రేపు జరగాల్సిన ‘జగనన్న తోడు’ కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్లు గ్రామ, వార్డు సచివాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. మిలాద్-ఉన్-నబీ పండుగ సెలవు కావడంతో ‘జగనన్న తోడు’ కార్యక్రమాన్ని వాయిదా వేశామన్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తామని అజయ్‌జైన్ తెలిపారు.





















