IAS Promotion: తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌లకు ప్రమోషన్, జనవరి 1 నుంచి అమల్లోకి
IAS Promotion: తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌లకు ప్రమోషన్ లభించింది. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందారు.
![IAS Promotion: తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌లకు ప్రమోషన్, జనవరి 1 నుంచి అమల్లోకి Telangana 14 IAS official promtion news in Telugu IAS Promotion: తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌లకు ప్రమోషన్, జనవరి 1 నుంచి అమల్లోకి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/19/641e4a394e2d0bb6ca333d14af1965511702999961867233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana IAS Promotion News: హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను ఇదివరకే బదిలీ చేసింది. తాజాగా 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన కొంత సమయానికే ఐఏఎస్ లకు ప్రమోషన్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌లకు ప్రమోషన్ లభించింది. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందారు. ఈ ప్రమోషన్ 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ప్రమోషన్ పొందిన వారిలో పమేలా సత్పతి, అనురాగ్ జయంతి, గౌతమ్ పాత్రు, రాహుల్ రాజ్, భావేష్ మిశ్రా, సత్య శారదాదేవి, నారాయణ రెడ్డి, ఎస్. హరీష్, జి. రవి, కె. నిఖిల, అయేషా మష్రత్ ఖానమ్, సంగీత సత్యనారాయణ, యాసీన్ బాషా, వెంకట్రావ్ ఉన్నారు. కొందరు అదే పదవిలో కొనసాగనుండగా.. కొందరు ఐఏఎస్ లు కొత్త పోస్టులలో విధులు నిర్వహించనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)