Teenmar Mallanna new party: బీసీల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ - తీన్మార్ మల్లన్న ప్రకటన
Telangana Rajyaadhikara Party: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీగా పేరు పెట్టారు

Teenmar Mallanna announces Telangana Rajyaadhikara Party: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తన కొత్త రాజకీయ పార్టీకి 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' అనే పేరును ఖరారు చేశారు. హైదరాబాద్ లోని ఓ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో పార్టీని ప్రకటించారు. పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు,,.. జెండా పైభాగంలో ఎరుపు రంగు, కింది భాగంలో ఆకుపచ్చ రంగు ఉన్నాయి. జెండా మధ్యలో కార్మిక చక్రాన్ని, దాని నుంచి పైకి లేస్తున్నట్లుగా పిడికిలి బిగించిన అరచేతి చిహ్నంగా పొందుపరిచారు. జెండాపై 'ఆత్మగౌరవం, అధికారం, వాటా' అనే నినాదాన్ని ముద్రించారు.
తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. ఆయన మొదట జర్నలిస్ట్‌గా పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజకీయ ప్రవేశం 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2021 డిసెంబర్ 7న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. 2023 నవంబర్ 8న మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే సమక్షంలో చేరారు. 2024లో కాంగ్రెస్ పార్టీ నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే, కులగణనపై దారుణమైన విమర్శలు చేయడంతో 2025 ఫిబ్రవర్ 5న కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో సస్పెన్షన్ వేటు వేశారు.
తన కొత్త పార్టీ బీసీ సమాజాన్ని ఏకం చేసి, వారి రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం పోరాడే ప్లాట్‌ఫారమ్‌గా రూపొందించానని అంటున్నారు.
బీసీల చేతిలో భూములు, సంపద మ, జకీయ అధికారం అమలు చేయడం లక్ష్యమని చెబుతున్నారు. "తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొచ్చామని బీసీలు ఏకం చేసి, వారి హక్కుల కోసం పోరాడతాము." అని ప్రకటించారు. అయితే మల్లన్న పార్టీ పెట్టడం ఇదే మొదటి సారి కాదు. 2023లో 'తెలంగాణ నిర్మాణ పార్టీ' పేరుతో కొత్త పార్టీ ప్రకటించారు, కానీ అది ముందుకు సాగలేదు. ఇప్పుడు బీసీ ఎజెండాతో కొత్తగా ప్రయత్నిస్తున్నారు.
BIG BREAKING
— Pulse of Telangana (@pulseoftelangan) September 17, 2025
తెలంగాణ రాజ్యాధికార పార్టీగా ( TRP)
తీన్మార్ మల్లన్న కొత్త పార్టీకి పేరు pic.twitter.com/aH5uaOeMBi
తీన్మార్ మల్లన్న రాజకీయంగా ముఖ్యమంత్రి స్థానాన్నిపొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో బీసీ సంఘాల కోసం సభలు నిర్వహించారు. ఇప్పుడు నేరుగా పార్టీ పెట్టడం ద్వారా.. బీసీల్లోని అన్ని కులాలను ఏకంగా చేసి ఆయన రాజ్యాధికారం చేపట్టాలని అనుకుంటున్నారు.
ట్రెండింగ్ వార్తలు





















