Jagtial : ఉపాధ్యాయుల దారుణం - విద్యార్థునిలతో కండోమ్స్ ప్యాకెట్లను శుభ్రం చేయించింది ఒకరు- చెప్పుతో కొట్టింది మరొకరు
Jagtial : జగిత్యాలలోని సీఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు, మద్యం సీసాలను అక్కడి విద్యార్థులతోనే శుభ్రం చేయించడం కలకలం రేపింది.

Telangana News : విద్యార్థులను ఉన్నత మార్గంలో నడపాల్సిన కొందరు ఉపాధ్యాయులే నీచ పనులకు పాల్పడుతున్నారు. నిజానికి బడిని గుడిలా భావిస్తూంటాం. కానీ ఈ పవిత్రమైన ప్రదేశం ఇప్పుడు కొన్నిచోట్ల అపవిత్రంగా మారుతోంది. జగిత్యాల జిల్లాలోని ఓ బాలికల పాఠశాల అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. క్రిస్టియన్ స్కూల్ ఇంటర్నేషన్ బాలికల పాఠశాలలో కండోమ్స్ ప్యాకెట్లు కలకలం రేపాయి. వాటితోపాటు మద్యం సీసాలు కూడా కనిపించడం ఆందోళనను రేకెత్తిస్తోంది. దానికి తోడు మరో నీచమైన, దారుణమైన విషయమేమిటంటే, రేపు జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు, అక్కడ చదువుతోన్న విద్యార్థులతోనే పరిసరాలను శుభ్రం చేయించారు. అటెండర్లతో చేయాల్సిన పనులను పిల్లలతోనే కానిచ్చేశారు. అంతటితో ఆగకుండా అక్కడ కనిపించిన కండోమ్ ప్యాకెట్లను కూడా ఆ విద్యార్థులతోనే శుభ్రం చేయిస్తుండడం ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఇప్పుడు ఈ విషయం బయటికి రావడంతో పాఠశాల సిబ్బందిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ పరిసరాల్లో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతోన్న వారిని వెంటనే కనిపెట్టి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే గుడి లాంటి పాఠశాలలోకి మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు ఎలా వచ్చాయన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఈ విషయంపై పాఠశాల హెడ్ మాస్టర్ ని ప్రశ్నించగా.. సమాజంలో ఇదంతా సహజమేనని, దానికి మేం ఏం చేయాలని నిర్లక్ష్యంగా మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలకు తాము కాపలా ఉండాలా అంటూ ఉపాధ్యాయుల సమాధానమిచ్చారు. మీరెందుకు క్లీన్ చేస్తున్నారని విద్యార్థులను ప్రశ్నించగా.. తమ పాఠశాలలో ఎప్పుడూ తామే శుభ్రం చేస్తామని, ఎవరూ స్కూల్ కి అటెండర్ ఎవరూ లేరని చెప్పారు. ఇక దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా నీచం, దారుణం, ఘోరం అంటూ విరుచుకుపడుతున్నారు. మహిళా కమిషన్ ఈ విషయాన్ని వెంటనే సుమోటాగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై కఠినంగా వ్యవహరించాలని కోరారు.
విద్యార్థినులపైకి చెప్పు విసిరిన ఉపాధ్యాయుడు
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనూ ఓ ఘటన చోటుచేసుకుంది. తొమ్మితో తరగతి విద్యార్థినులపైకి శ్రీనివాస్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు కోపంలో చెప్పు విసిరాడు. దీంతో ఓ విద్యార్థిని మెడకు, మరో విద్యార్థిని చెవికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని విద్యార్థిని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే పాఠశాలకు వచ్చి శ్రీనివాస్ రెడ్డికి దేహశుద్ధి చేశారు. క్లాస్ రూంలో ఇద్దరు విద్యార్థినిలు నవ్వడంతో కోపంతో ఆ టీచర్ వాళ్లపైకి చెప్పు విసిరారని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కేవలం రెండు పాఠశాలలే కాదు వెలుగులోకి రాని స్కూల్స్ లోనూ ఇలాంటి కార్యకాలాపాలు చాలానే ఉన్నాయి. విద్యార్థిగా పాఠశాలలో చదువుకోవాల్సిన పిల్లలు ఉపాధ్యాయుల సమక్షంలోనే బాల కార్మికులుగా మారుతున్నారు.
Also Read : Budget: భారత బడ్జెట్‌లో బ్రిటిష్ సంప్రదాయానికి స్వస్థి - తేదీలు, సమయాల్లో విప్లవాత్మక మార్పులు





















