Press Academy Chairman: తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి, ట్విస్ట్ ఏంటంటే!
Telangana Press Academy Chairman: తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కె. శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
Sreenivas Reddy, Telangana Media Academy chairman: హైదరాబాద్: తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్, జర్నలిస్ట్ యూనియన్ లీడర్ కె. శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గత ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పోస్టులను రద్దు చేసింది. మరోవైపు అధికారుల బదిలీలు సైతం కొనసాగుతున్నాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇటీవల మాట్లాడుతూ రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవిని త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. దాని ప్రకారం గానే తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా కె.శ్రీనివాస్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. దాంతో ప్రెస్ అకాడమీ తదుపరి చైర్మన్ ఎవరు అనే చర్చకు తెరపడింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ కె. శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా సేవలు అందించారు. ఈ సీనియర్ జర్నలిస్ట్ ప్రస్తుతం ప్రజాపక్షం పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు హయాంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా సేవలు అందించిన జర్నలిస్ట్‌కు రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి బాధ్యతలు అప్పగించడం హాట్ టాపిక్ అవుతోంది.