అన్వేషించండి

Singareni Elections 2023: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Singareni Elections 2023:

Singareni Elections 2023 Polling: సింగరేణి(Singareni) గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణ(Telangana)లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కీలకమైన మరో సమరంలో కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్‌(BRS) హోరాహోరీగా తలపడుతున్నాయి. అదే స్థాయిలో హామీలు కూడా ఇచ్చాయి. ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో జెండా పాతాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తోపాటు వామపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆ దిశగానే మొన్నటి వరకు ప్రచారం చేశాయి. 

6 జిల్లాలు- 84 పోలింగ్ కేంద్రాలు

ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్‌లో 84 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అర్థరాత్రికి ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. 

మూడు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు

మొత్తం 39వేల 809 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల బరిలో 13 కార్మిక సంఘాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి ఎవరి షిప్టుల్లో వాళ్లు వచ్చి ఓట్లు వేస్తున్నారు. బెల్లంపల్లిలో ఐదు, శ్రీరాంపూర్‌లో 15 మందమర్రిలో 11 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీరాంపూర్‌లో 9వేల 124 మంది ఓటర్లు ఉన్నారు. మందమర్రిలో 4వేల 876 మంది ఉన్నారు బెల్లంపల్లి 985 మంది ఓటర్లు ఉన్నారు. 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ హోరాహోరీ  

సాధారణ ఎన్నికలకు మించిన రాజకీయం ఈ బొగ్గుగనుల్లో జరుగుతోంది. రాష్ట్రంలో అధికారమార్పిడీ జరిగినందున ఇక్కడ కూడా పట్టు కోల్పోకూడదని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించింది. పట్టిన పట్టు నిలుపుకోవాలని బీఆర్‌ఎస్‌ వ్యూహాలు రచించింది. ఈ ఎన్నికల బరి నుంచి టీజీబీకేఎస్‌ తప్పుకుంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ అనుబంధ సంస్థైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏఐటీయూసీకి మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ రెండు సంఘాలు ప్రకటించాయి. కాంగ్రెస్ అనుబంధ సంస్త ఐఎన్‌టీయూసీ పోటీలో నిలిచింది. 

1998 నుంచి ఎన్నికలు 

తెలంగాణలోని సింగరేణి గనుల్లో తరచూ జరిగే సమ్మెలను నివారించేందుకు 1998 నుంచి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదట్లో రెండేళ్ల కాలపరిమితి ఉండేది. తర్వాత అదే నాలుగేళ్లకు పెంచారు. మళ్లీ 2017 నుంచి కేంద్రం ఆదేశాల మేరకు గుర్తింపు సంఘాల కాలపరిమితిని రెండేళ్లకే పరిమితం చేశారు. అయితే దీనిపై గెలిచిన గుర్తింపు సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఆ కేసు విచారణలో ఉన్నందున 2021లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. 

నాలుగేళ్లా? రెండేళ్లా?

కోర్టు అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి నోటిఫికేషన్ మాత్రం రెండేళ్ల కాలపరిమితితోనే విడుదలైంది. దీనిపై భవిష్యత్‌లో గుర్తింపు సంఘాలు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అన్నది మాత్రం తేలాల్సి ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget