News
News
వీడియోలు ఆటలు
X

Siddipet News : బిర్యానీ రైస్ బాత్రూంలో క్లీనింగ్, సిద్ధిపేటలో ఓ రెస్టారెంట్ నిర్వాకం!

Siddipet News : సిద్దిపేటలోని ఓ హోటల్ నిర్వాహకులు చేసిన పనికి కస్టమర్లు షాక్ అయ్యారు. కిచెన్ లో క్లీన్ చేయాల్సిన బిర్యానీ రైస్ ను వాటర్ రావడంలేదని టాయిలెట్ లో క్లీన్ చేస్తూ కస్టమర్లకు చిక్కారు.

FOLLOW US: 
Share:

Siddipet News : బిర్యానీ పేరు చెప్పగానే నోట్లో నీళ్లూరుతాయ్ చాలా మందికి. రెస్టారెంట్స్ వెళ్లే వారు ఎక్కువగా బిర్యానీనే ఆర్డర్ చేస్తారు. ఈ ఏడాది రంజాన్ సీజన్ లో హలీమ్ కన్నా ఎక్కువగా బిర్యానీ ఆర్డర్స్ వచ్చాయని ఫుడ్ డెలివరీ సంస్థలు తెలిపాయి. అలాంటి బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సిద్ధిపేటలో జరిగిన ఈ ఘటన చూస్తే... బిర్యానీ పేరు చెబితే కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. బిజీ లైఫ్ లో బయటి ఫుడ్ కు అలవాటు పడిన జనాలు... టిఫిన్ నుంచి ఫుడ్ వరకూ అన్నీ రెస్టారెంట్ నుంచే. ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక కనీసం రూమ్ నుంచి బయటకు వెళ్లకుండానే ఫుడ్ ఇంటికి వచ్చేస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయ్ కానీ ఆ ఫుడ్ ను హోటల్స్ యాజమాన్యం పరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నారా అంటే సందేహించాల్సిందే. సిద్ధిపేటలో ఓ హోటల్ యాజమాన్యం నిర్వాకం తాజాగా వైరల్ అవుతోంది.   

బిర్యానీ రైస్ బాత్రూంలో క్లీనింగ్ 

సిద్దిపేటలోని సోని రెస్టారెంట్‌లో బిర్యానీ తినేందుకు ఓ కస్టమర్ వెళ్లాడు. బిర్యానీ ఆర్డర్ ఇచ్చి హ్యాండ్స్ వాష్ చేసుకునేందుకు వెళ్లగా.. అక్కడ ఓ ఘటన చూసి వాంతులు చేసుకునే పరిస్థితిలో బయటకు వచ్చాడు. బిర్యానీ వాడే రైస్ ను కిచెన్ లో వాటర్ రావడం లేదని బాత్రూంలో కడుగుతూ కస్టమర్లకు అడ్డంగా దొరికారు. ఈ విషయంపై యాజమాన్యాన్ని అడిగితే మోటర్ కాలిపోయింది, వాటర్ ప్రాబ్లం ఉందని రెస్టారెంట్ నిర్వాహకులు సమాధానం ఇవ్వడం ఇక్కడ కొసమెరుపు. దీంతో ఈ రెస్టారెంట్ లో తినడానికి వచ్చిన మాదే తప్పు అని లెంపలేసుకుని కస్టమర్లు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంట్లో ఫుడ్ వద్దు బయటి ఫుడ్ ముద్దు అనుకునే వాళ్లకు ఈ వీడియో తప్పకుండా చూపించాలంటున్నారు నెటిజన్లు.

హైదరాబాద్ లో బిర్యానీ అమ్మకాల రికార్డు

ఈ రంజాన్ సీజన్ లో హైదరాబాద్ బిర్యానీ, హ‌లీమ్ అమ్మకాలు దుమ్మురేపాయి. కొత్త రికార్డులు సృష్టించాయి. రంజాన్ సందర్భంగా హైదరాబాద్ లో ఒక మిలియ‌న్ బిర్యానీ,  4 ల‌క్షల హలీమ్ ఆర్డర్లు  వ‌చ్చాయి. రంజాన్ సందర్భంగా హలీమ్, చికెన్ బిర్యానీ, సమోసా వంటి సంప్రదాయ వంటకాలకు ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయని వ్యాపారస్తులు తెలిపారు.  ఈ రంజాన్ సీజన్ లో స్విగ్గీలో ఒక మిలియన్ బిర్యానీలను ఆర్డర్ చేసినట్లు తాజా నివేదిక పేర్కొంది. స్విగ్గీ మార్చి 23 నుంచి ఏప్రిల్ 18 వరకు వచ్చిన ఆర్డర్లను విశ్లేషిస్తే... హలీమ్ కు 4 లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బిర్యానీ ఆర్డర్ల సంఖ్య 20 శాతం పెరిగాయని స్విగ్గీ తెలిపింది. ఇఫ్తార్ విందులో ఉండే సమోసాలు, భజియాలతో పాటు ఖర్జూరాలతో చేసిన వంటకాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. భజియాలకు ఆర్డర్లు 77 శాతం పెరిగాయన్న స్విగ్గీ.... మటన్ హలీంతో పాటు చికెన్, పాలమూరు పోటెల్, పర్షియన్ స్పెషల్ హలీమ్, డ్రై ఫ్రూట్ హలీమ్ సహా మరో తొమ్మిది రకాల హలీమ్ లకు డిమాండ్ భారీగా పెరిగిందని స్పష్టం చేసింది.  

Published at : 22 Apr 2023 04:39 PM (IST) Tags: Biryani Siddipet Viral News Bathroom cleaning

సంబంధిత కథనాలు

IIIT Hyderabad: హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్‌, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌‌లో ప్రవేశాలు!

IIIT Hyderabad: హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్‌, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌‌లో ప్రవేశాలు!

Jupally Krishna Rao Arrest: కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన మాజీ మంత్రి జూపల్లి అరెస్ట్, ఉద్రిక్తత

Jupally Krishna Rao Arrest: కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన మాజీ మంత్రి జూపల్లి అరెస్ట్, ఉద్రిక్తత

Gang Arrest : ఐటీ అధికారుల పేరుతో బంగారం దోపిడీ - గ్యాంగ్ ను పట్టుకున్న పోలీసులు ! ఈ స్కెచ్ మమూలుగా లేదుగా

Gang Arrest :   ఐటీ అధికారుల పేరుతో బంగారం దోపిడీ - గ్యాంగ్ ను పట్టుకున్న పోలీసులు !  ఈ స్కెచ్ మమూలుగా లేదుగా

Nizamabad News: నిజామాబాద్ పోలీసుల సెల్ఫ్ డిఫెన్స్, గాల్లోకి కాల్పులు - అయినా పారిపోయిన దొంగలు

Nizamabad News: నిజామాబాద్ పోలీసుల సెల్ఫ్ డిఫెన్స్, గాల్లోకి కాల్పులు - అయినా పారిపోయిన దొంగలు

Top 5 Headlines Today: ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు! ఇటు కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

Top 5 Headlines Today: ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు! ఇటు కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

టాప్ స్టోరీస్

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి