Shabbir Ali on KTR : ఏం పీకామో కేసీఆర్‌ను అడుగు - కేటీఆర్‌కు షబ్బీర్ అలీ ఘాటు కౌంటర్ !
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఘాటు విమర్శలు చేశారు. దారుణమైన భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Shabbir Ali on KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామారెడ్డి పర్యటనలో మాజీ మంత్రి షబ్బీర్ అలీపై విమర్శలు చేయడంతో ఆయన ఘాటుగా విరుచుకుపడ్డారు. గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టిన షబ్బీర్ అలీ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ లనుప్రజలు తరిమికొట్టకపోతే పేరు మార్చుకుంటాననిసవాల్ చేశారు. కేటీఆర్ కామారెడ్డి నుండి వెళ్తే ఆ రోడ్డు మొత్తం బంద్ పెట్టారు. షాప్ లు క్లోజ్ చేశారు.. బందోబస్తూ ఏర్పాటు చేశారన్నారు. కేటీఆర్ ప్రోగ్రాం ఉందని కాంగ్రెస్ నేతలను రాత్రే అరెస్ట్ చేశారు.. ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేత సుభాష్ రెడ్డి ని హౌజ్ అరెస్ట్ చేశారని.. అందర్నీ బంధించి కామారెడ్డిలో పర్యటించి వెళ్లారని విమర్శించారు.
కాంగ్రెస్ మీద మాట్లాడే తీరు చూస్తే కేటీఆర్ పూర్తి అహంకారంతో ఉన్నారని షబ్బీర్ అల విమర్సించారు. కాంగ్రెస్ ఎం చేసిందో మీ నాయిన ని అడుగాలని కేటీఆర్‌కు సూచించారు. రాజకీయంగా కేటీఆర్ కాంగ్రెస్ కు జన్మనిచ్చిందని గుర్తు చేశారు. ఏం పీకారు అని మాట్లాడుతున్నరాని.. అదేం భాష అని ప్రశ్నించారు. ప్రతి ఐటీ కంపెనీ నుంచి 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని షబ్బీర్ ఆరోపించారు. కెటిఆర్.. ఎగిరెగిరి పడకు. ఇంకా మీకు 100 రోజుల గడువు మాత్రమే ఉందన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ నుండి ఎవరు పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి తనదేనని, తాను గెలవడం పక్కా అన్నారు. తాను చెప్పకపోయినప్పటికీ ఇక్కడి ప్రజలు కేటీఆర్‌ను నిలదీశారన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నాయకులను తరిమి కొట్టకపోతే నా పేరు షబ్బీర్ అలీయే కాదన్నారు. కామారెడ్డికి తాను ఏం చేశానో కేసీఆర్‌ను అడిగితే చెబుతాడన్నారు. కౌన్సిల్‌లోనే తన గురించి కేసీఆర్ ఏం చెప్పారో కేటీఆర్ తెలుసుకొని మాట్లాడాలన్నారు.
ఓఆర్ఆర్ చంద్రబాబు నాయుడు 62 కిలోమీటర్ల 6 లైన్ ల రోడ్ ప్రపోజల్ చేస్తే.. కాంగ్రెస్ 12 లైన్స్ తో 159 కిలోమీటర్లు చేశామన్నారు. ఎక్కడ సిగ్నల్ లేకుండా దేశంలోనే పెద్ద రింగ్ రోడ్డు నిర్మించామనని గుర్తు చేశారు. మేము ఓఆర్ఆర్ తెస్తే మీరు సంపాదించుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ భూములు అమ్మి ఎం చేయాలనుకుంటున్నారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కేటీఆర్ 100 రోజుల తరువాత ఎక్కడ ఉంటావో చూసుకోవాలని సలహా ఇచ్చారు. కేటీఆర్ తగిన బుద్ధి త్వరలోనే చెబుతామన్నారు.
కెసిఆర్ కామారెడ్డి వస్తా అంటే ఎవరు వద్దనడం లేదు... తాను కాంగ్రెస్ లో కామారెడ్డి నుండే పోటీ చేస్తున్నానని ప్రకటించారు. మేము చూసుకుందాం అంటే ప్రజలు మీ తోలు తీస్తారన్నారు.
9 సంవత్సరాలుగా ఎం చేయలేదన్నారు. 2015 లో లక్షా, గత సంవత్సరం మైనార్టీ ల కోసం 2 లక్షల అప్లికేషన్లు వచ్చాయి.. ఇప్పుడు ఒక్కో నియోజకవర్గనికి 120 మందికి ఇస్తే బీదరికం పోతుందా అని ప్రశ్నించారు. ఇచ్చేది కూడా బీఆర్ఎస్ నేతలేక ఇస్తున్నారన్నారు.