అన్వేషించండి

BL Santhosh: ఉంటే ఉంటారు, పోతే పోతారు - ఆసత్య ప్రచారం నమ్మకండి: బీఎల్ సంతోష్

పార్టీలో ఉండేవారు ఉంటారు పోయేవారు పోతారు అనవసర మాటలు తగ్గించండి తప్పుడు ప్రచారాలు నమ్మకండి అంటూ బీఎల్ సంతోష్ వ్యాఖ్యానించారు.

ఎవరి కోసమో పార్టీ విధానాలను మార్చుకోదని, గత 35 గా పార్టీ ఎలా ఉందో అలాగనే నడుస్తుందని బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ అన్నారు. బీజేపీ రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ... "పార్టీలో ఉండేవారు ఉంటారు... పోయేవారు పోతారు... అనవసర మాటలు తగ్గించండి... తప్పుడు ప్రచారాలు నమ్మకండి... మోడీ కేసీఆర్ కలిసి ఉంటే ఈ కార్యక్రమాలు ఎందుకు?" అంటూ బీఎల్ సంతోష్ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఆయన విమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ పై జనంలో వ్యతిరేకత నెలకొందని, దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రధాన బలహీనత అహంకారమేనని చెప్పారు. అటువంటి అహంకారం బీజేపీ లో ఉండదని చెప్పారు. అహంకారం ఎక్కువ అయ్యే కొద్ది పతనం మొదలవుతుందని త్వరలో ప్రజలు కేసీఆర్ కు గుణపాఠం చెబుతారని అన్నారు. పార్టీ నేతలు నిరంతరం ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.   కేవలం ఎన్నికల సమయానికో, పబ్లిక్ మీటింగ్ లకు పరిమితం కావద్దని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని తెలిపారు.

కొత్త పాత తేడాలు పక్కన పెట్టాలని రాబోయే రోజుల్లో చాలా ముఖ్య నాయకులు కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీలో పని చేసే వారికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో బిజెపి చేస్తున్న పనులు, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఉత్తరప్రదేశ్లో ముగ్గురు దళిత మహిళలను మంత్రులను చేశామని విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. తెలంగాణలో సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ చూస్తోందని, కార్యకర్తలు ఎవరు భయపడకుండా ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించాలని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన సీఎంగా చేసేది తెలంగాణకు చెందినవారినేనని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని కోరారు.

తెలంగాణలో బీజేపీ పై సానుకూల వాతావరణం ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని భావన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉందని వెల్లడించారు. అవినీతి కుటుంబాన్ని ఎప్పుడు జైల్లో వేస్తున్నారనే   ప్రశ్నలు ప్రజల్లో నుంచి వస్తున్నాయని బిఎల్ సంతోష్ స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో సర్వేలు చేయించుకొని భయపడుతున్నారని చెప్పారు. 

రాష్ట్ర నాయకులు స్థానికంగా ఉన్న సమస్యను స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రిల దృష్టికి తీసుకువచ్చేలా కృషి చేయాలని చెప్పారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి వెంటనే వాటిపై ఉద్యమాలు చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని చెప్పారు. రాష్ట్రంలో బిజెపిపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందని, ఎక్కడికి వెళ్లిన జనం విశేషంగా ఆదరిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారు రావాలని కోరుకుంటున్నారని ఇందుకు అందరూ కష్టపడాలని సూచించారు.           

టాప్ హెడ్ లైన్స్

VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Konda Surekha: కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget