News
News
X

BRS Mla Sayanna Nomore : కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

BRS Mla Sayanna Nomore : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

FOLLOW US: 
Share:

BRS Mla Sayanna Nomore : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  సంతాపం ప్రకటించారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న.. చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవను...తనతో వారికున్న అనుబంధాన్ని  సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సాయన్న కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. సాయన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

సీఎం కేసీఆర్ నివాళి 

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న భౌతిక కాయానికి సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. సాయన్న నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత 

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఆదివారం ఉదయం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన వైద్యులు చికిత్స అందించారు. అయితే మధ్నాహ్నం ఒంటిగంట 15 నిమిషాలకు ఆయన గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సాయన్నకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. సాయన్న మొదటిసారి 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు గెలిచిన సాయన్న 2009లో మాజీ మంత్రి శంకర్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2014లో టీడీపీ నుంచి 2018లో టీఆరెఎస్ నుంచి గెలుపొందారు.  2014 టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన సాయన్న 2015లో టీటీడీ బోర్డు మెంబర్ గా సేవలందించారు. అనంతరం అనివార్య రాజకీయ పరిస్థితుల్లో గులాబీ గూటికి చేరారు. హర్యానా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ గా ఆరు ఏళ్లు సేవలందించారు. టీడీపీ నగర అధ్యక్షుడుగా కూడా పనిచేశారు.  సాయన్న మృదుస్వభావి, వివాదరహితుడుగా పేరు పొందారు. పార్టీలకతీతంగా కంటోన్మెంట్ నేతలంతా సాయన్నను అభిమానిస్తారు.  1951 మార్చి 20న సాయన్న చిక్కడ పల్లిలో జన్మించారు. తన ఉన్నత విద్యాభ్యాసం ఉస్మానియాలో చేశారు. 

ఐదు సార్లు ఎమ్మెల్యే 

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుండి 2009 వరకు వరుసగా మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నగరంలో టీడీపీకి పట్టున్న నియోజకవర్గంగా మారిందంటే ఎమ్మెల్యే సాయన్న పరిపాలన, మంచితనమే కారణమని చెబుతుంటారు. కానీ అనూహ్యంగా 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమిచెందారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి సమీప అభ్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (ప్రస్తుత బీఆర్ఎస్)  గజ్జెల నగేష్ పై 3275 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా అది ఆయనకు నాలుగో విజయం. మరుసటి ఏడాది 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ పాలన వైపు మొగ్గు చూపుతూ అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నేత సర్వే సత్యనారాయణపై 37,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలుగు పర్యాయాలు టీడీపీ నుంచి, ఒకసారి టీఆర్ఎస్ నుంచి విజయాలు అందుకున్న ఎమ్మెల్యే సాయన్న కేవలం ఒక ఎన్నికల్లో ఓటమి చెందారు.

Published at : 19 Feb 2023 04:17 PM (IST) Tags: Secunderabad cantonment CM KCR Mla sayanna Ministe KTR

సంబంధిత కథనాలు

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

Minister Errabelli : పేపర్ లీక్ పై పిచ్చి పిచ్చి ఆరోపణలు, దమ్ముంటే నిరూపించండి - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్

Minister Errabelli : పేపర్ లీక్ పై పిచ్చి పిచ్చి ఆరోపణలు, దమ్ముంటే నిరూపించండి - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!