అన్వేషించండి

Telangana: ఆర్టీసీ కార్మికల సమ్మె వాయిదా - ప్రభుత్వంతో చర్చలు సఫలం - ఉద్యోగులతో చర్చలకు కమిటీ

Telangana Employees: ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించుకున్నారు. ఇతర ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.

RTC employees call off strike :  తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించారు. ప్రభుత్వ ప్రతినిధులతో జరిపిన చర్చలతో వారు సంతృప్తి చెందారు. సమ్మె యోచన విరమించుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇతర ఉద్యోగులు కూడా ప్ర్భుత్వంపై సమరమేనని ప్రకటించడంతో వారితో చర్చలు జరిపేందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీని నిమించారు.

ఆర్టీసీ ఉద్యోగులు ఏడో తేదీ నుంచి అంటే బుధవారం నుచి సమ్మెకు వెళ్లాలన అనుకున్నారు. తేదీ దగ్గర పడటంతో ప్రభుత్వం వారి డిమాండ్లకు ఏ మాత్రం సానుకూలంగా వ్యవహరించకపోగా కఠినంగా వ్యవహరించింది. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోని సమ్మెకు వెళ్తే సంస్థ మనుగడుకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. అదే సమయంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు లేఖ రాసింది. ఆర్టీసీఉద్యోగుల సంక్షేమం విషయంలో  ఏ మాత్రం రాజీపడబోదని హామీ ఇచ్చింది. సమ్మె పేరుతో ఉద్యోగులను బెదిరిస్తే కఠిన చర్యలు ఉంటాయని  యాజమాన్యంలేఖను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ రాసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆర్థిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఆర్టీసీ కార్మికులను ఆలోచింప చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చే అవకాశం లేదని క్లారిటీ రావడంతో వారు సమ్మె ప్రతిపాదన విరమించుకున్నట్లుగా తెలుస్తోంది.  మరో వైపు ఇతర ఉద్యోగులు కూడా పోరు బాట పట్టాలని డిసైడయ్యారు. దీంతో వారితో చర్చల కోసం ముగ్గురు అధికారులతో కమిటీని నియమించారు. నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్ లు ఈ కమిటీలో ఉంటారు. వీరు ఉద్యోగ సంఘం నేతలతో చర్చలు జరుపుతారు. వారి డిమాండ్లు ఏమిటో తెలుసుకుని ప్రభుత్వం ముందు ఉంచుతారు.   

రేవంత్ ఆగ్రహంతో వెనక్కి తగ్గుతున్న  ఉద్యోగులు ? 

డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు వెళ్తామంటున్న ఉద్యోగా సంఘాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల నేతలు ఇక సమరమే అంటున్నారని..  ఇదేదో మనోళ్లేనా, ఇంకెవరైనా అన్నారా అని అనుకున్నానని అన్నారు. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ఉద్యోగ సంఘాల నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై సమరం చేస్తామని  ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారని..  . ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగులు మూడున్నర లక్షల మంది.. మీరు ప్రకటించిన సమరం 97 శాతం ప్రజల మీదనా అని ప్రశ్నించారు. జీతాలు రానప్పుడు కనీసం నోరు విప్పారా?.. ఇప్పుడు జీతాలు రావడం లేదని ఉద్యోగులు అడగకుండానే వేశాం కదా అని ప్రశ్నించారు. 

గతంలో బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉండేందుకు రిటైర్‌మెంట్‌ ఏజ్ పెంచారు.. మీరు దాచుకున్న సొమ్ము, బెనిఫిట్స్ రూ.9 వేల కోట్లు పెండింగ్ పెట్టారు.. ప్రజలు కష్టాల్లో ఉంటే సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలు సమరం అంటున్నాయి.. మీకు జీతాలు ఇస్తున్న ప్రజలే మాకు ఉద్యోగాలు ఇచ్చారు.. సమస్య ఉంటే చర్చకు రండి, చర్చిద్దాం.. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్లు ఎవరూ బాగుపడలేదు.. ప్రజల మీద యుద్ధం చేస్తారా?.. రాజకీయ నాయకుల చేతిలో పావులుగా మారకండి, ప్రజల గుండెల్లో చురకత్తులు పొడవకండి అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

టాప్ హెడ్ లైన్స్

Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Telangana Politics: ఎన్నికలపై నమ్మకం లేకుంటే కాంగ్రెస్ సీఎంలు రాజీనామా చేయాలని రామచందర్ రావు ఛాలెంజ్
ఎన్నికలపై నమ్మకం లేకుంటే కాంగ్రెస్ సీఎంలు రాజీనామా చేయాలి: రామచందర్ రావు ఛాలెంజ్
Indiramma Towers: ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు అలర్ట్.. అక్టోబర్ 9 లోగా డిపాజిట్ చెల్లించకపోతే ఇల్లు రద్దు!
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు అలర్ట్.. అక్టోబర్ 9 లోగా డిపాజిట్ చెల్లించకపోతే ఇల్లు రద్దు!
Telangana Secretariat: తెలంగాణ సచివాలయానికి తాగునీటి సరఫరా బంద్! ఇదెక్కడి వింత సమస్య
తెలంగాణ సచివాలయానికి తాగునీటి సరఫరా బంద్! ఇదెక్కడి వింత సమస్య

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget