అన్వేషించండి

Kavitha: కవిత సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్ - అరెస్టుపై కవిత ఏమన్నారంటే?

Telangana News: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను తమ కస్టడీకి అప్పగించాలన్న పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కవితను గతంలో విచారణకు పిలిచినా హాజరవ్వలేదని సీబీఐ తెలిపింది.

Rouse Avenue Court Reserves Verdict On Kavitha Cbi Custody: ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi liquor Case) ఎమ్మెల్సీ కవితను (Mlc Kavitha) సీబీఐ కస్టడీకి అప్పగించాలన్న పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమెను గురువారం అరెస్ట్ చేసిన సీబీఐ శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరిచింది. దీనిపై విచారించిన న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. కవితను 5 రోజుల కస్టడీకి అప్పగించాలని.. ఆమె నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. దీంతో కోర్టు రూం నుంచి కవితను అధికారులు తీసుకెళ్తుండగా కవిత మాట్లాడారు.

కవిత ఏమన్నారంటే.?

తనను సీబీఐ అరెస్ట్ చేయడం అక్రమమని కవిత అన్నారు. 'న్యాయ సలహా కావాలని అడిగినా నన్ను అరెస్ట్ చేశారు. నన్ను సీబీఐ అరెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని రాత్రి 10:30కు చెప్పారు. మా లాయర్లతో మాట్లాడాలని చెప్పాను' అని పేర్కొన్నారు. అటు, కోర్టులో కవిత తరఫున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సీబీఐ కవితను అరెస్ట్ చేసిందని చెప్పారు. ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారని.. హక్కులు కాపాడాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తన అరెస్టను వ్యతిరేకిస్తూ కవిత 2 పిటిషన్లు దాఖలు చేయగా.. సీబీఐ కస్టడీ పిటిషన్ పై లంచ్ తర్వాత వాదనలు ప్రారంభం కానున్నాయి. 

సీబీఐ ఏం చెప్పిందంటే.?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత కీలక సూత్రధారి అని సీబీఐ పేర్కొంది. 'అప్రూవర్ మాగుంట, శరత్ చంద్ర సెక్షన్ 161. 164 కింద కవిత పాత్రపై వాంగ్మూలం ఇచ్చారు. అయినా కవిత దర్యాప్తునకు సహకరించడం లేదు. మా వద్ద ఉన్న ఆధారాలతో ఆమెను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. గతంలో ఆమెను విచారణకు పిలిచినా హాజరు కాలేదు. అభిషేక్ బోయినపల్లి భారీ ఎత్తున డబ్బు హవాలా రూపంలో చెల్లించారు. ఈ డబ్బును గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లు సమీకరించినట్లు వాట్సాప్ చాట్ ధృవీకరిస్తోంది.' అని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు కోర్టుకు అందజేశామని పేర్కొంది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. 

మద్యం పాలసీ కేసులో గత నెల 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో కవితను అరెస్ట్ చేశారు. ఆమె కస్టడీని ఇప్పటికే మూడు సార్లు పొడిగించింది కోర్టు. కవిత రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఆమె బయటకు రావాలంటే ఈడీ కేసులోనే కాదు సీబీఐ కేసు లోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. 

Also Read: Pradhan Mantri Matru Vandana Yojana: గర్భవతులకు ఆరువేల ఆర్థిక సాయం - కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget