అన్వేషించండి

Kavitha: ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు - సవాల్ పిటిషన్లను తోసిపుచ్చిన న్యాయస్థానం

Telangana News: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. తనను ప్రశ్నించడం, అరెస్టును సవాల్ చేస్తూ ఆమె రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆ పిటిషన్లు తోసిపుచ్చింది.

Rouse Avenue Court Rejected Kavitha Petition: ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) ఎమ్మెల్సీ కవితకు (Kavitha) మరోసారి చుక్కెదురైంది. సీబీఐ తనను ప్రశ్నించడాన్ని, అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది. అటు, ఈ కేసులో కవితను విచారించాలని.. తమకు 5 రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ వేసిన పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. కాసేపట్లో దీనిపై తీర్పును వెలువరించనుంది. కాగా, ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ కేసులో కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఆమెను గురువారం సీబీఐ అరెస్ట్ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ.. కవిత కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే సీబీఐ తనను ప్రశ్నించిందని.. అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతోందని కవిత తెలిపారు. తనను కస్టడీకి ఇవ్వొద్దని కోరారు.

ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమెను గురువారం అరెస్ట్ చేసిన సీబీఐ శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరిచింది. దీనిపై విచారించిన న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. కవితను 5 రోజుల కస్టడీకి అప్పగించాలని.. ఆమె నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. దీంతో కోర్టు రూం నుంచి కవితను అధికారులు తీసుకెళ్తుండగా కవిత మాట్లాడారు. తనను సీబీఐ అరెస్ట్ చేయడం అక్రమమని కవిత అన్నారు. 'న్యాయ సలహా కావాలని అడిగినా నన్ను అరెస్ట్ చేశారు. నన్ను సీబీఐ అరెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని రాత్రి 10:30కు చెప్పారు. మా లాయర్లతో మాట్లాడాలని చెప్పాను' అని పేర్కొన్నారు. అటు, కోర్టులో కవిత తరఫున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సీబీఐ కవితను అరెస్ట్ చేసిందని చెప్పారు. ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారని.. హక్కులు కాపాడాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 

సీబీఐ వాదనేంటంటే.?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత కీలక సూత్రధారి అని సీబీఐ పేర్కొంది. 'అప్రూవర్ మాగుంట, శరత్ చంద్ర సెక్షన్ 161. 164 కింద కవిత పాత్రపై వాంగ్మూలం ఇచ్చారు. అయినా కవిత దర్యాప్తునకు సహకరించడం లేదు. మా వద్ద ఉన్న ఆధారాలతో ఆమెను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. గతంలో ఆమెను విచారణకు పిలిచినా హాజరు కాలేదు. అభిషేక్ బోయినపల్లి భారీ ఎత్తున డబ్బు హవాలా రూపంలో చెల్లించారు. ఈ డబ్బును గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లు సమీకరించినట్లు వాట్సాప్ చాట్ ధృవీకరిస్తోంది.' అని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు కోర్టుకు అందజేశామని పేర్కొంది.

కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో కవితను అరెస్ట్ చేశారు. ఆమె కస్టడీని ఇప్పటికే మూడు సార్లు పొడిగించింది కోర్టు. కవిత రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఆమె బయటకు రావాలంటే ఈడీ కేసులోనే కాదు సీబీఐ కేసు లోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. 

Also Read: Warangal BRS: వరంగల్ బీఅర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య! పిలిచి మరీ కేసీఆర్ ఛాన్స్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Nandamuri Mokshagna: మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Embed widget