IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Revant Reddy : ప్రభుత్వంలో "బీహార్ ముఠా" పాలన - తెలంగాణ ఐఏఎస్‌లు స్పందించాలని రేవంత్ పిలుపు !

బీహార్ అధికారుల పాలనతో తెలంగాణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని రేవంత్ విమర్శించారు. తెలంగాణ సివిల్ సర్వీస్ అధికారులు సమర్థులు కారా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

FOLLOW US: 

తెలంగాణలో బీహార్ ఉన్నతాధికారుల ముఠా రాజ్యమేలుతోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కూడా తమ పూర్వీకులు బీహార్ నుంచి వలస వచ్చారని 2008లో ప్రకటించుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వందలాది బలిదానాలతో తెలంగాణ సాధించుకున్నా  ఎనిమిదేళ్లలో తెలంగాణ పౌరులకు పరిపాలనలో అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.  సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ అంజనీ కుమార్ తో బీహార్ ఐఏఎస్ లకు ఒక్కొక్కరి వద్ద ఆరు శాఖలు ఉన్నాయని.. బీహార్ ఐఏఎస్ లను ఒక రక్షణ వలయంగా ఏర్పాటు చేసుకొని పరిపాలన చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ ప్రాంత అధికారుల తీరు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 

మీ పూర్వికులు బీహార్ కావొచ్చు కానీ  పరిపాలన మొత్తం బీహార్ బ్యాచ్ కే ఇస్తారా అని కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 152 మంది ఐఏఎస్ లలో కేవలం బీహార్ ఐఏఎస్ లే ప్రతిభావంతులా అని ప్రశ్నించారు.  సీఎస్ సోమేశ్ కుమార్ ఐఏఎస్ సర్వీస్ లో ఏడేళ్లు పని చేయలేదని సోమేశ్ కుమార్ సీనియారిటీ ప్రకారం  ప్రిన్సిపల్ సెక్రటరీ కే పరిమితమవ్వాలి .. కానీ సీఎస్ గా బాధ్యతలు ఇచ్చారన్నారు.  విభజన సందర్భంగా ఏపీ క్యాడర్ కు సోమేశ్ కుమార్ ను కేటాయించారని ఈ అంశంపై డీవోపీటీలో కేసు ఉంటే బెంచ్ మీదకు రాకుండా మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు.  జయేష్ రంజన్ , అరంవింద్ కుమార్ , సందీప్ కుమార్ సుల్తానియా , రజత్ కుమార్ వీరందరూ బీహార్ కు చెందిన ఐఏఎస్ లు ఒక ముఠాగా ఏర్పడ్డారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 30 లక్షల ఓట్లను సోమేశ్ కుమార్ తొలగించారు... నజరానా గా సీఎస్ పోస్ట్.. రజత్ కుమార్.. జనరల్ ఎన్నికల్లో అవక తవకలకు సహకరించినందుకు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రకరీ ఇచ్చారని ఆరోపించారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ కూడా బీహార్ బ్యాచ్.. బీహార్ ఐఏఎస్ లపై నిఘా పెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. 
 
అరవింద్ కుమార్ చేస్తున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. ఈయనకు ఆరు శాఖలు ఇచ్చారు. ఐపీఎస్ అంజనీ కుమార్ కూడా బీహార్ బ్యాచ్.. డీజీపీ మహేందర్ రెడ్డి ని ఉన్న ఫలంగా పంపించి.. బీహార్ బ్యాచ్  అంజనీ కుమార్ ను తీసుకొచ్చారన్నారు.  రాష్ట్రం మొత్తం  బీహారీల చేతిలో బందీ చేశారు. పరిపాలనలో బీహారీల తప్పుడు విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ధరణి పోర్టల్ దేశానికే ఆదర్శమని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతూ వచ్చారని ఇప్పుడు ఈ పోర్టర్ కారణంగానే భూతగాదాలతో హత్యలకు దిగుతున్నారని ఆరోపించారు.  ఇబ్రహీంపట్నం లో ఇద్దరు మర్డర్లు  ధరణి లోపాల వల్లే జరిగాయన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ తీరుతో ధరణి లోపభూయిష్టంగా మారిందని రేవంత్ మండిపడ్డారు.ధరణి పోర్టల్ ను అడ్డంపెట్టుకుని అవుటర్ రింగ్ చుట్టూ లక్షలాది ఎకరాలు గోల్ మాల్ అయ్యిందని ..బీహార్ ఐఏఎస్ ముఠా  కారణంగా తెలంగాణ సమాజం ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రతిపక్ష నేతగా తాను విమర్శలు చేస్తూంటే  వివరణ ఇవ్వాల్సింది పోయి.. మళ్లీ బీహార్ వ్యక్తులు రంగంలో కి దిగారని మండిపడ్డారు. బీహార్ మంత్రి సంజయ్ కుమార్ ఝా అనే మంత్రి.. కేసీఆర్ సమర్థిస్తూ తనను విమర్శిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాట్లాడాలని.. చైతన్య వంతమైన తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. 

Published at : 02 Mar 2022 02:34 PM (IST) Tags: telangana Telangana Government kcr Rewanth Reddy Tea PCC Chief Bihar officials

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 26 May: ఈ నగరాల్లో వారికి శుభవార్త! ఇక్కడ ఇంధన ధరలు తగ్గుముఖం, ఈ సిటీల్లో మాత్రం పైపైకి

Petrol-Diesel Price, 26 May: ఈ నగరాల్లో వారికి శుభవార్త! ఇక్కడ ఇంధన ధరలు తగ్గుముఖం, ఈ సిటీల్లో మాత్రం పైపైకి

Gold-Silver Price: వరుసగా రెండోరోజూ బంగారం ధర షాక్! పెరిగిన పసిడి, వెండి ధరలు

Gold-Silver Price: వరుసగా రెండోరోజూ బంగారం ధర షాక్! పెరిగిన పసిడి, వెండి ధరలు

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్‌ దాఖలు

Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్‌ దాఖలు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్‌ చేసిన RCB - రాహుల్‌ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!

LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్‌ చేసిన RCB - రాహుల్‌ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

Today Panchang 26 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, మతత్రయ ఏకాదశి ప్రత్యేకత

Today Panchang 26 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, మతత్రయ ఏకాదశి ప్రత్యేకత

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?