అన్వేషించండి

Huzurabad Congress : అభ్యర్థిని ఎంపిక చేసుకోలేకపోతున్న కాంగ్రెస్..! హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీనేనా..!?

టీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్థుల్ని ఖరారు చేసుకున్నాయి. కానీ కాంగ్రెస్‌లో మాత్రం ఎవరు అభ్యర్థి అవుతారో ఎవరికీ క్లారిటీ లేదు.


హుజూరాబాద్‌లో అసలు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు . రెండు రోజుల కిందటే వస్తుందని రాజకీయ పార్టీలు హడావుడి పడ్డాయి. కానీ ఎన్నికల కమిషన్ నుంచి స్పందన లేదు. కానీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉపఎన్నికలు పెండింగ్‌లో ఉండటంతో నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యాచరణ ప్రకటించారు. అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. హరీష్ రావును రంగంలోకి దింపారు. అంటే అక్కడ టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో  బలగాలను మోహరిచిందన్నమాట.  బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ దాదాపుగా ఖరారరయ్యారు.  ఆయన  కాకపోతే ఆయన భార్య జమున అభ్యర్థి అవుతారు . కానీ ఈటల పోటీ చేయకపోతే .. ఆయన ఓడిపోతారని అందుకే ఆయన భార్యను నిలబెట్టారన్నప్రచారం జరుగుతుంది.

 అందుకే ఈటలే అభ్యర్థిగా ఫైనల్ అవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా ఈటల లేకపోతే ఆయన భార్య అభ్యర్థి అవుతారు.  అటు టీఆర్ఎస్.. ఇటు బీజేపీ వర్గాల్లో అభ్యర్థులపై క్లారిటీ ఉంది. కానీ.. కాంగ్రెస్ పార్టీలోనే అభ్యర్థి ఎవరో చూచాయగా కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా కౌశిక్ రెడ్డి ఉన్నారు.. ఆయన తర్వాత స్వర్గం రవి అనే నేత ఉన్నారు. వీరిద్దర్నీ టీఆర్ఎస్ పార్టీలో  చేర్చుకున్నారు కేసీఆర్. ఒక వేళ అభ్యర్థిగాఎవర్నైనా ఖరారు చేసినా... వారిని కూడా ఆకర్షించేందుకు అధికారపార్టీ ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. అందుకే టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభ్యర్థి విషయంలో తొందరపడటం లేదు. కానీ ఏ ఒక్కఅభ్యర్థి పేరూ గట్టిగా వినపడకపోతూడటంతో ప్రజల్లో నెగెటివ్ ప్రచారం ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 

కాంగ్రెస్ పార్టీ రేసులో లేదేమోనన్న అభిప్రాయం కలగడానికి కారణం అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థే దొరకలేదని.. ఆ పార్టీతో అసలు పోటీ లేదని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అసలు పరీక్ష ప్రారంభమైనట్లు అయింది. దుబ్బాకలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చివరి క్షణం వరకూ ప్రకటించలేకపోయారు. ఈ కారణంగా కాంగ్రెస్  పార్టీ అక్కడ మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన నాయకత్వ పటిమను ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. గత యాభై ఏళ్లలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవలేదు.  ఆ కారణంతో తాము పోటీలో లేమని చెప్పడానికి కూడా చాన్స్ ఉండదు. ప్రతీ సారి గట్టి పోటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. 

ఇప్పుడు అక్కడ కనీసం రెండో స్థానంలో అయిన నిలబడకపోతే.. కాంగ్రెస్ పార్టీకి మరింత గడ్డు పరిస్థితి ఎదురవుతుంది.  అభ్యర్థి విషయంలో రేవంత్ రెడ్డి అంతర్గతంగా సర్వేలు నిర్వహించుకుంటున్నారు.  అయితే దామోదర్ రాజనర్సింహ లేకపోతే కొండా సురేఖను బరిలోకి దించాలనే ఆలోచన చేస్తున్నారు.  ఎవరినైనా సరే త్వరగా ఖరారు చేసి...  ప్రచార బరిలోకి దిగితేనే ముక్కోణపు పోటీ అన్నట్లుగా చూస్తారని లేకపోతే... టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయం మారిపోతుందని అంటున్నారు. అదే జరిగితే.. రేవంత్‌కు పీసీసీ చీఫ్‌గా మొదటి భారీ ఎదురుదెబ్బ ఖాయమవుతుందని విశ్లేషిస్తున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget