అన్వేషించండి

Telangana Jobs: జాబ్ కాలెండర్ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy About Telangana Job Calendar | తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ప్రకారమే గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Telangana Group 1 Jobs | హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల భ‌ర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలికావద్దని ఆయన సూచించారు. ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇష్టమొచ్చినట్లు నిబంధనలు మార్చితే త‌లెత్తే చ‌ట్ట ప‌ర‌మైన అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిన‌ట్లు త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటే నిరుద్యోగుల‌కు న్యాయం జ‌రగ‌కడానికి బదులు ఇప్పుడున్న నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదముందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్ప‌టికే 28,942 ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టింద‌ని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏళ్ల‌కు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామ‌కాల‌కు ఉన్న కోర్టు చిక్కుల‌న్నింటిని అధిగ‌మించింద‌న్నారు. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్ష‌లు నిర్వహించి, ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌న్నారు. శాస‌న‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశాల్లో చ‌ర్చించి జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ నియామ‌క ప‌రీక్ష‌లు, వివిధ బోర్డులు నిర్వ‌హించే ప‌రీక్ష‌ల‌తో ఆటంకాలు లేకుండా నిరుద్యోగుల‌కు న్యాయం జ‌రిగేలా క్యాలెండ‌ర్ ఉంటుందన్నారు. నిరుద్యోగుల విష‌యంలో తాము క‌స‌ర‌త్తు చేస్తుంటే కొంద‌రు మాత్రం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం నిరుద్యోగుల జీవితాల‌తో చెల‌గాట‌మాడుతున్నార‌ని సీఎం రేవంత్ మండిపడ్డారు. కొంద‌రి కుట్ర‌ల‌తో నోటిఫికేష‌న్ల‌లోని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్ణ‌యాలు తీసుకుంటే ఉద్యోగాలు భ‌ర్తీ చేసే ప్ర‌క్రియ నిలిచిపోయి, నిరుద్యోగులు మరింత నష్టపోతారని రేవంత్ చెప్పారు. 

త‌న నివాసంలో రేవంత్ రెడ్డి సమావేశం.. 
నిరుద్యోగుల ఆందోళ‌న‌ల దృష్ట్యా శుక్ర‌వారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి త‌న నివాసంలో స‌మావేశం ఏర్పాటు చేశారు.  దాదాపు 3 గంట‌ల పాటు జ‌రిగిన ఈ స‌మావేశంలో  నిరుద్యోగుల‌కు సంబంధించిన డిమాండ్లు, జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌ను గురించి అడిగి తెలుసుకున్నారు. వెంట‌నే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారితో పాటు సంబంధిత అధికారుల‌ను పిలిపించి సీఎం మాట్లాడారు. నిరుద్యోగులు లేవ‌నెత్తిన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాల‌పై చ‌ర్చించారు. 

గ్రూప్ 1 ప‌రీక్ష‌కు ఒక్కో పోస్టుకు 1: 50 నిష్ప‌త్తి చొప్పున కాకుండా 1: 100 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయాల‌నే డిమాండ్ పై సుదీర్ఘంగా చ‌ర్చ జ‌రిగింది. గ‌త ప్ర‌భుత్వం 2022లో వేసిన‌ గ్రూప్ 1 ప‌రీక్ష పేప‌ర్ల లీకేజీ, త‌ప్పుడు నిర్ణ‌యాల కార‌ణంగా 2 సార్లు వాయిదా ప‌డింద‌న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  సుప్రీంకోర్టులో ఉన్న ఈ పిటిష‌న్ వెన‌క్కి తీసుకుంద‌ని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివ‌రించారు. పాత నోటిఫికేష‌న్‌ను ర‌ద్దు చేసి అద‌నంగా మ‌రిన్ని పోస్టుల‌తో కొత్త నోటిఫికేష‌న్ జారీ చేసింద‌న్నారు. ప‌న్నెండేండ్ల త‌ర్వాత చేప‌ట్టిన‌ గ్రూప్ 1 ప‌రీక్ష‌కు నాలుగు ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు పోటీ ప‌డ్డారు.. ఇటీవ‌లే  ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను టీజీపీఎస్‌సీ ప‌కడ్బందీగా నిర్వ‌హించామన్నారు.

నోటిఫికేషన్ ప్రకారమే మెయిన్స్‌కు ఎంపిక 
గ్రూప్ 1 నోటిఫికేష‌న్ ప్ర‌కారం ప్రిలిమ్స్ లో మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున‌ మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. ఇప్పుడు 100 మందిని ఎంపిక చేసేలా నిబంధ‌న‌ల‌ను స‌వ‌రిస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్ర‌మాద‌ముంది, అదే జ‌రిగితే మొత్తం నోటిఫికేష‌న్ మ‌ళ్లీ నిలిచిపోతుంద‌ని భావించారు. నోటిఫికేష‌న్‌లో ఉన్న నిబంధ‌న‌ల‌ను మార్చితే న్యాయ‌ప‌రంగా చెల్లుబాటు కాద‌ని సీఎంకు అధికారులు వివ‌రించారు.  గ్రూప్ 1 ప‌రీక్ష రెండోసారి ర‌ద్ద‌యినప్పుడు  హైకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను సీఎంకు వివరించారు. అప్ప‌టి నోటిఫికేష‌న్‌లో ఉన్న‌ బ‌యో మెట్రిక్ ప‌ద్ధ‌తిని ఎందుకు పాటించ లేద‌నే ఏకైక‌ కార‌ణంతో రాష్ట్ర హైకోర్టు ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసింద‌ని గుర్తు చేశారు. 1999లో యూపీఎస్‌సీ వ‌ర్సెస్ గౌర‌వ్ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేశారు. నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న దానికంటే ఎక్కువ మందికి అవ‌కాశ‌మిస్తే.. ముందుగా ఉన్న‌వాళ్ల‌కు అన్యాయం జ‌రిగిన‌ట్లే అని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింద‌న్నారు.
Also Read: TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్

పోస్టుల పెంపుపై చర్చ
తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు మీద కూడా చర్చించారు. ప‌రీక్ష‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్న స‌మ‌యంలో పోస్టులు పెంచ‌టం కూడా నోటిఫికేష‌న్ ను ఉల్లంఘించిన‌ట్లే అవుతుంద‌ని  సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గ్రూప్ 1 కు కొత్త నోటిఫికేష‌న్ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచ‌టం సాధ్య‌మైంద‌ని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేష‌న్ల‌కు అలాంటి వెసులుబాటు లేద‌న్నారు. గ్రూప్ 2, డీఎస్సీ ప‌రీక్ష‌లు వెంట వెంటనే ఉండ‌టంతో అభ్య‌ర్థులు న‌ష్ట‌పోతున్నార‌ని విద్యార్థి సంఘం నాయ‌కులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. జులై 17నుంచి ఆగ‌స్టు 5వ తేదీ వ‌ర‌కు డీఎస్సీ ప‌రీక్ష‌లు ఉన్నాయ‌ని, ఆ వెంట‌నే 7, 8 తేదీల్లో గ్రూప్ 2 ఉండటంతో ప్రిపరేష‌న్‌ను ఇబ్బంది ప‌డుతున్నార‌ని చెప్పారు.  ప‌రీక్ష‌ల తేదీల విష‌యంలో టీజీపీఎస్‌సీ, విద్యాశాఖ‌తో చ‌ర్చించి త‌దుప‌రి  నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget