News
News
వీడియోలు ఆటలు
X

Revant Reddy Chit Chat : బీఆర్ఎస్‌తో పొత్తులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు - క్లారిటీ ఇచ్చేసినట్లేనా ?

బీఆర్ఎస్‌తో పొత్తుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు.

FOLLOW US: 
Share:

Revant Reddy Chit Chat :   తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పొత్తులపై జరుగుతున్న చర్చకు రేవంత్ రెడ్డి  క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.  తాను టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.  మీడియా ప్రతినిధులతో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి... కొన్ని విషయాలపై కుండబద్దలు కొట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని వెల్లడించారు. మాఫీయాతో కాంగ్రెస్ ఎప్పటికీ చేతులు కలపదన్నారు. తెలంగాణలో ధృతరాష్ట్ర కౌగిలికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. తెలంగాణ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఈ సారి ప్రజలు 80 సీట్లు కట్టబెడతారని చెప్పారు. ఈ సారి కేసీఆర్ కు 25 కంటే ఎక్కువ సీట్లు రావని జోస్యం చెప్పారు. అటు బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ట్రయాంగిల్ లవ్ నడుస్తోందన్నారు.

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో పొత్తులపై విస్తృత చర్చ జరుగుతోంది. మొదట కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తర్వాత జానారెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధాన ప్రత్యర్థి అయిన  బీఆర్ఎస్‌తో పొత్తుల గురించి మాట్లాడటం వల్ల సీరియస్ నెస్ తగ్గుతోందని.. ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీగా భావించరని రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. రాహుల్ గాంధీపై వేసిన అనర్హతా వేటు విషయంలో ఆ పార్టీకి మద్దతు పలికారు. దీంతో  కాంగ్రెస్ నేతలు కొంత మంది బీఆర్ఎస్‌తో పొత్తు ఆలోచనలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో పొత్తుల గురించి మాట్లాడితే సమస్య ఉండేది కాదు కానీ.. రాష్ట్ర స్థాయిలో పొత్తులపై మాట్లాడుతూండటంతో  రేవంత్ రెడ్డి వర్గానికి కోపం తెప్పిస్తోంది. 

బీఆర్ఎస్‌తో పొత్తు ప్రతిపాదనలు ఏమైనా ఉంటే.. అది తాను రాజీనామా చేసిన తర్వాతనేనని..  రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు. అలాంటి పరిస్థితి వస్తే తాను పీసీసీ చీఫ్‌గా ఉండబోనని చెప్పినట్లయింది. నిజానికి బీఆర్ఎస్‌ ను ఓడించడానికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజకీయ పునరేకీకరణ కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చాలా సార్లు చెప్పారు.  అది కూడా  బీఆర్ఎస్‌ను ఓడించడానికేనన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి కూడా బీఆర్ఎస్‌తో అంత గొప్ప సంబంధాలు లేవు. తెలంగాణ ఇస్తే ..  టీఆర్ఎస్‌ను  కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. కానీ తర్వాత హ్యాండిచ్చారు. ఇది కూడా హైకమాండ్ ఆగ్రహానికి ఓ కారణంగా  ఉందని చెబుతున్నారు. 

అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరని చెబుతూంటారు. అందుకే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కలవడంపై చర్చ జరుగుతోంది. అలా జరగడానికి కూడా రేవంత్ రెడ్డి ఇష్టపడటం లేదు. తెలంగాణలో ఒంటరిగా అధికారంలోకి వస్తామని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో  బీఆర్ఎస్ తో పొత్తు వార్తలు వస్తే మొదటికే మోసం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. 

Published at : 04 Apr 2023 04:52 PM (IST) Tags: Telangana Congress Revanth Reddy Telangana politics

సంబంధిత కథనాలు

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?