అన్వేషించండి

Revant reddy : కేసీఆర్ పుట్టక ముందే తెలంగాణ ఉద్యమం - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్ !

కేసీఆర్ పుట్టక ముందే తెలంగాణ ఉద్యమం ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

 

Revant reddy :  కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పుట్టకపోతే రాష్ట్రం వచ్చేది కాదని కేటీఆర్ అన్నారని.. కానీ ఆయన పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. పాలమూరు బిడ్డ చిన్నారెడ్డి అప్పట్లో ఉద్యమం నడిపారని తెలిపారు. ఎలక్షన్లు, కలెక్షన్ల కోసమే 2001లో ముఖ్యమంత్రి పార్టీ పెట్టారని విమర్శించారు. ఈ క్రమంలోనే 22 సంవత్సరాలు జెండా మోసిన గంగాపురం రాజేందర్‌కు న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. నల్లమల అడవుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి వివరించారు.   

దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ - అన్ని పార్టీలూ ఆలోచించాలన్న తెలంగాణ బీజేపీ నేత !                            

గాంధీ భవన్ లో అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు, న్యాయవాది గంగాపురం రాజేందర్, మాజీ జడ్పీటీసీ భీముడు నాయక్, అచ్చంపేట, చారగొండ మండలాల కార్యకర్తలు గాంధీభవన్‌లో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణను పాలించే అర్హత లేదని స్పష్టం చేశారు. దోపిడీకి 4 కోట్ల మంది ప్రజలు బలి అయ్యారని రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్లలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి.. బొందలగడ్డగా మార్చారని విమర్శించారు. సీఎం అరాచక పాలనను భరించే ఓపిక రాష్ట్ర ప్రజలకు లేదని.. కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కలిగించేందుకే.. ఈ చేరికలు జరుగుతున్నాయని అన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.              

కాంగ్రెస్‌లో తెలంగాణ జన సమితి విలీనం - కోదండరాం స్పందన ఇదీ !                                             

హైదరాబాద్‌లో తాగు నీటి సమస్య తీర్చిన ఘనత పీజేఆర్ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వందలాది ఐటీ కంపెనీలను నగరానికి తెచ్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికికేసీఆర్ ఛార్లెస్ శోభరాజ్‌లా, హరీశ్‌, కేటీఆర్ బిల్లా-రంగాలా తయారయ్యారని విమర్శించారు. పార్టీ కార్యకర్తలంతా.. తెలంగాణ ప్రజల కోసం సమయం కేటాయించాలని అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని  విశ్వాసం వ్యక్తం చేశారు.              

కాంగ్రెస్ గెలిస్తే వచ్చే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కల్పిస్తామని... పేదలు ఇళ్లు కట్టుకోవటానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని రేవంత్ ప్రకటించారు. రైతులకు రెండు లక్షల వరకూ రుణమాఫీ చేస్తామన్నారు. ఏడాదిలోగా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నారు.   దోపిడీదారులను పొలిమేరలు దాటే వరకు తరమాలని రేవంత్ అన్నారు. ఆ బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Telangana Graduate MLC Elections 2027: పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget