Revanth Reddy: తెలంగాణలో వరదలపై రేవంత్ రెడ్డి వాయిదా తీర్మానం, రాజ్యసభ రేపటికి వాయిదా
Rajya Sabha News: ఈ పార్లమెంటు సమావేశాలలో మొత్తం 32 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 24 కొత్త బిల్లులు ఉండగా 5 పాత బిల్లులు ఉన్నాయి.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఇవాల్టి (జూన్ 18) నుంచి నుండి ఆగస్టు 12వ తేదీ వరకు 17 రోజుల పాటు ఈ పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలలో మొత్తం 32 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. “తెలంగాణ గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ” బిల్లును కూడా ఈ సమావేశాలలోనే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మొత్తం బిల్లులో 24 కొత్త బిల్లులు ఉండగా 5 పాత బిల్లులు ఉన్నాయి. అదేవిధంగా కాలం చెల్లినవి 71 చట్టాలు ఉన్నాయని వాటిని తొలగిస్తామని గతంలోనే తెలిపారు.
అయితే, తొలి రోజుక సమావేశాల ప్రారంభం సందర్భంగా.. వరద సమస్యలు, ధరల పెరుగుదల, అగ్నిపథ్ సహా అనేక సమస్యలను విపక్షాలు లేవనెత్తుతున్నాయి. తెలంగాణలో వరద పరిస్థితులపై లోక్ సభలో అత్యవసరంగా చర్చించాలని మల్కాజ్ గిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణలో గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన వరద పరిస్థితిపై చర్చించాలని రేవంత్ కోరారు. రాష్ట్రంలోని విపరీత వరద పరిస్థితుల కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, ఇంకా ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు.
Also Read: KTR: సత్తెమ్మను పరిచయం చేసిన కేటీఆర్, మంత్రిని ఆలింగనం చేసుకునేంత చనువు - అసలు ఎవరీమె?
‘‘11 లక్షల ఎకరాలకు పైగా సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. తెలంగాణ పరిస్థితి జాతీయ విపత్తుగా ప్రకటించి రూ.2 వేల కోట్ల తక్షణ సహాయ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మౌలిక సదుపాయాల నష్టాలను సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు. విధ్వంసకర వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, రాజ్యసభ ఎంపీగా వి.విజయసాయి రెడ్డి ప్రవమాణస్వీకారం చేశారు. వరుసగా రెండోసారి ఆయన రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే. మరోవైపు, రాజ్యసభకు కొత్తగా దక్షిణాది నుంచి కేంద్రం ఎంపిక చేసిన ఎన్నికైన నలుగురు సభ్యులు విజయేంద్రప్రసాద్, కేరళకు చెందిన ప్రముఖ అథ్లేట్ పీటీ ఉష, తమిళనాడుకు చెందిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా, కర్నాటకకు చెందిన వీరేంద్ర హెగ్డే కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
రాజ్యసభ వాయిదా
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యసభలో విపక్షాల ఆందోళన చేశాయి. దీంతో రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడింది.
Also Read: కుండపోత వర్షాలకు మీ తప్పులే కారణం, భవిష్యవాణిలో అమ్మవారు ఆగ్రహం - భక్తులకు సూచనలు