అన్వేషించండి

Revanth Reddy: రుణమాఫీ చేసేశాం, హరీశ్ రాజీనామా చేస్తారా? లేదా ఆ పని చేయండి - రేవంత్

Revanth Reddy Comments: రైతులకు రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని హరీశ్‌ రావు సవాల్‌ విసిరిన సందర్భాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వైరాలోని బహిరంగ సభలో మాట్లాడారు.

Khammam News: ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేయగలిగితే రాజీనామా చేస్తానని సవాలు విసిరిన మాజీ మంత్రి హరీశ్ రావు అన్న మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్  రెడ్డి అన్నారు. రుణమాఫీ చేయడం కుదరదని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పని చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గతంలో హరీశ్‌ రావు సవాల్‌ విసిరిన సందర్భాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు హరీశ్‌రావు రాజీనామా చేయాలని.. లేకుంటే తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదా హైదరాబాద్ లోని అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని అన్నారు. అదీ కుదరకపోతే తాను విసిరిన ఛాలెంజ్‌ను వెనక్కు తీసుకుంటున్నట్టు హరీశ్‌ రావు చెప్పాలని డిమాండ్ చేశారు.

సాగుకు జీవం.. రైతుకు ఊతం పేరుతో ఖమ్మం జిల్లా వైరాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హరీశ్ రావు గురించి ప్రస్తావించారు. దేశచరిత్రలోనే తొలిసారి రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రజాప్రభుత్వానికే దక్కిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 

రూ.2 లక్షల రుణమాఫీ కోసం మొత్తం రూ.31వేల కోట్లు వెచ్చిస్తున్నామని, తద్వారా వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు. ప్రజాప్రభుత్వం అజెండాలో వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఉందని, ఒకవైపు రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ, మరోవైపు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను కూడా శరవేగంగా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 

''ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును ఈరోజే జాతికి అంకితం చేసుకున్నాం. ఏడాది తిరిగేలోపే ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది" అని ముఖ్యమంత్రి తెలిపారు. అటు ప్రాజెక్టుల నిర్మాణం, ఇటు రుణమాఫీ ప్రక్రియతో తెలంగాణ రైతన్నల ఇంట పండుగ వాతావరణం నెలకొందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ ప్రక్రియలో సాంకేతిక కారణాలతో రైతులకు ఏవైనా ఇబ్బందులు వస్తే వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ మాటిస్తే అది శిలాశాసనం లాంటిదని, ఆరు గ్యారంటీలతోపాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకొని తీరుతామని సీఎం స్పష్టం చేశారు. ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ అసాధ్యం అని, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే పదవులకు రాజీనామాలు చేస్తామన్న ప్రతిపక్ష నేతలు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ముఖ్యమంత్రి సూచించారు.

సాగుకు జీవం - రైతుకు ఊతం బహిరంగ సభలో ముఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, పలువురు ఎంపీలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Chandrababu: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Chandrababu: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Embed widget