అన్వేషించండి

Revanth Reddy Delhi : ట్యాపింగ్ కేసుపై సీబీఐ విచారణ అడగరా ? - కేసీఆర్, కేటీఆర్‌లపై సీఎం రేవంత్ సెటైర్లు

Telangana News : ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని ఎందుకు అడగడం లేదని కేసీఆర్, కేటీఆర్‌ను రేవంత్ ప్రశ్నించారు. కీరవాణి విషయంలో తన ప్రమేయం లేదన్నారు.

Revanth Reddy Chit Chat In Delhi :  తెలంగాణ ఫోన్ ట్యాపింక్ కేసులో సీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని.. ప్రతీ దానికి సీబీఐ విచారణ కావాలనే వారు ఇప్పుడు ఎందుకు కోరడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన  రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. పోన్ ట్యాపింగ్ కేసు   వ్యవహారంలో పోలీసులకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చామన్నారు. అధికారం మారాక జరిగిన బదిలీల్లో కొన్ని వస్తువులు మాయమయ్యాయని.. బాధ్యులు ఎవరో తేల్చే క్రమంలో ట్యాపింగ్‌ అంశం బయటకు వచ్చిందన్నారు. మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయలేదని, ఆ అవసరంలేదని మాకు లేదన్నారు. ట్యాపింగ్ లాంటి వెదవ పనులు తాము చేయమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బ్యాకప్ డేటాకు సంబంధించిన హార్డ్ డిస్కులు ఫామ్ హౌస్‌లో ఉన్నాయో.. ఇంకా ఎక్కడ ఉన్నాయో విచారణ అధికారులు తేల్చాలని ముఖ్యమంత్రి అన్నారు.

కీరవాణి సంగీతాన్ని సెలక్ట్ చేసుకుంది అందెశ్రీనే !                                
 
తెలంగాణ గేయానికి సంబంధించి సంగీతాన్ని కీరవాణికి అప్పగించడంపై  వస్తున్న విమర్శలపైనా మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ గేయానికి సంబంధించిన  బాధ్యతను  అందెశ్రీ అప్పగించామన్నా రు. ఎవర్ని తీసుకుంటారనేది ఆయన ఇష్టమన్నారు. అందెశ్రీనే కీరవాణి సంగీతాన్ని కోరుకున్నారన్నారు.  తెలంగాణ అధికారిక చిహ్నం రూపకల్పన రుద్ర రాజేశంకి ఇచ్చామన్నారు. తెలంగాణ అంటే రాచరికానికి వ్యతిరేకమని, త్యాగాలు పోరాటాలు గుర్తుకు వస్తాయన్నారు. అవి గుర్తుకు వచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నామని తెలియజేశారు.  

నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా కాళేశ్వరంపై చర్యలు                                          

తెలంగాణలో విద్యుత్ సమస్య లేదని ..వినియోగం పెరగడంతో సరఫరాలో కొన్నిచోట్ల అవాంతరాలు ఏర్పడుతోందన్నారు.  అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అవన్నీ చర్చిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.   కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిఫుణులు చెప్పింది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. దాని ఆధారంగానే ముందుకు వెళ్తామన్నారు. 

అధికార దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలే రాలేదన్న రేవంత్                              
  
పక్క రాష్ట్రంలో పోలీసు అధికారులందరినీ కూడా ఎన్నికల సమయంలో ట్రాన్సఫర్ చేశారని, తెలంగాణలో ఎలాంటి ట్రాన్సఫర్‌లు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఎన్నికలు జరిగాయని, స్వేచ్ఛాయుత వాతావరణంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించామన్నారు. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేశామని ప్రతిపక్షాలు సైతం ఆరోపణలు చేయలేదని గుర్తు చేసారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కోసం సోనియాను ఆహ్వానించేందుకు రేవంత్ ఢిల్లీ వచ్చారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
iPhone Amazon Offer: ఐఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ - రూ.40 వేలలోపే!
ఐఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ - రూ.40 వేలలోపే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
iPhone Amazon Offer: ఐఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ - రూ.40 వేలలోపే!
ఐఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ - రూ.40 వేలలోపే!
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
Embed widget