By: ABP Desam | Updated at : 12 May 2022 06:41 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
బాలికకు అబార్షన్ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం
Rangareddy Crime : తెలంగాణ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకంపై అధికారులు విచారణ చేపట్టారు. ఇబ్రహీంపట్నం రామరక్ష ఆసుపత్రిపై వైద్యశాఖ అధికారుల విచారణ చేపట్టారు. పెళ్లి కాని మైనర్ కు వైద్యులు అబార్షన్ చేశారు. బాలికకు తెలియకుండా మత్తుమందు వైద్యులు అబార్షన్ చేసినట్లు తెలుస్తోంది. మర్రిగూడ కుదస్పల్లికి చెందిన సిరిపంగ శ్రవణ్ అనే యువకుడు బాలికను గర్భవతి చేశాడని మర్రిగూడా పోలీసు స్టేషన్ బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. శ్రవణ్, రాధిక, బుగ్గయ్య, రామస్వామి, రామరక్ష ఆసుపత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్లు 417, 420, 312, 342, 376, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాలిక అబార్షన్ పై రంగంలోకి దిగిన వైద్యాధికారులు విచారణ చేపట్టారు. అబార్షన్ పై ఆరా తీస్తున్నారు.
డిప్యూటీ డీఎంహెచ్ఓ విచారణ
"ఆసుపత్రికి సంబంధించిన రికార్డ్స్ ను అన్ని పరిశీలించి, అబార్షన్ జరిగింది వాస్తవం కాదా నిర్ణయిస్తాం. బాలిక తల్లి అనుమతి లేకుండా అబార్షన్ చేశారని అని కేసు నమోదు అయింది. కేషిట్, పరీక్షలు చేసిన రికార్డ్ ను చూశాం. ఆసుపత్రిలో ఒకలా FIR కాపీలో ఒకలా ఉంది. రెండు రికార్డ్స్ టాలీ అవ్వడం లేదు. బాలిక అబార్షన్ సంబంధించిన వివరాలు, అడ్మిట్ అయిన వివరాల్లో వయసు ఫ్రూఫ్ లేదు. ఆసుపత్రిని ప్రణీత రెడ్డికి, సుధాకర్ రెడ్డికి లీజుకు ఇచ్చారు. దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ వెరిఫై చేశాం. ఎఫ్ఐఆర్ కాఫీలో ఆరు నెలల ప్రెగ్నెన్సీ అని, ఆసుపత్రిలో నాలుగు నెలల ప్రెగ్నెన్సీ ఉంది. ఏప్రిల్ 30 రాత్రి 10కి డిశ్చార్ అయినట్టుగా ఉంది. ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టుగా లేదు. పర్మిషన్ ఇచ్చేంత వరకు ఎలాంటి ట్రీట్మెంట్ ఆసుపత్రిలో చేయకూడదని రికార్డ్స్ అన్ని సీజ్ చేశాం. అన్నీ పరిశీలించిన తర్వాతే రెడ్డి రామరక్షా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయాలి. మరో మూడు రోజులు ఆసుపత్రి రికార్డ్స్ పరిశీలించి అనుమతులు లేకుంటే సీజ్ చేస్తాం. మైనర్ ను అబార్షన్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఆసుపత్రిపై ఎంక్వరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. " నాగజ్యోతి, డిప్యూటీ డీఎంహెచ్ఓ
పల్నాడు జిల్లాలో దారుణం
పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురజాల పట్టణంలోని ఓ కాలనీలో ఐదు సంవత్సరాల బాలికపై 16 ఏళ్ల మైనర్ లైంగిక దాడి చేసిన సంఘటన గురువారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డివిజినల్ పోలీస్ అధికారి డీఎస్పీ జయరామ్ ప్రసాద్, అర్బన్ సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగర పంచాయతీ గురజాల పట్టణంలో ఓ కాలనీలో బుధవారం సాయంత్రం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఒంటరిగా ఉన్న బాలికను ఆడుకుందామని పిలిచి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాత్రి తల్లిదండ్రులు వచ్చే సమయానికి చిన్నారి నలతగా ఉండడంతో చిన్నారిని ప్రశ్నించగా స్థానిక కాలానికి చెందిన యువకుడు తనపై చేసిన అఘాయిత్యాన్ని వివరించింది. దీంతో గురువారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా