By: ABP Desam | Updated at : 10 Jan 2023 05:27 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి కేటీఆర్
Minister KTR : రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో బీజేపీ గుజరాత్ డబ్బులు ఎన్ని ఖర్చుపెట్టినా ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని రుజువైందని మంత్రి కేటీఆర్ అన్నారు. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించిన సందర్భంగా మంగళవారం వినియోగదారులు, రైతులతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెస్ ఎన్నికల సమయంలో బండి సంజయ్ గుజరాత్ నుంచి రూ.5 కోట్లు తీసుకువచ్చి పంచిపెట్టారని ఆరోపించారు. డబ్బులు పంచినోళ్లే తిరిగి బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
ఇది ట్రైలర్ మాత్రమే
సెస్ ఎన్నికల్లో గెలవలేని వాళ్లు రాష్ట్రంలో గెలుస్తారా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గుజరాత్ డబ్బులు ఎన్ని పంచినా కేసీఆర్‌నే సీఎంను చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రుజువు చేసిందన్నారు. సెస్ ఎన్నికల్లో మొన్న చూసింది ట్రైలరే 2023లో అసలు సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో బీజేపీని నడిపేవాళ్లు మూర్ఖులని మండిపడ్డారు. దమ్ముంటే తమకంటే ఎక్కువగా మంచి పనులు చేసి ప్రజల మనసులను గెలవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో ముందుందన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేయాలన్నారు. సెస్ పరిధిలో ప్రత్యేక విద్యుత్ ప్రణాళిక రూపొందించాలని కేటీఆర్ సూచించారు.
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి @KTRTRS పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. pic.twitter.com/x2mlkxFRPu
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 10, 2023
రూ.10 చందా అయినా రాశారా?
రాష్ట్రాల మధ్య గొడవలు పరిష్కరించలేని ప్రధాని మోదీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపారా? మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు గొడవను కేంద్రం పరిష్కరించలేకపోయిందన్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఉందని గుర్తుచేశారు. 14 మంది ప్రధానులు చేసిన అప్పు మోదీ ఒక్కరే చేశారని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కరోనా సమయంలో కుర్‌కురే ప్యాకెట్లు పంచారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేంద్ర నిధుల విషయంలో సవాల్ చేశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.2 లక్షల కోట్లు వెళ్తే, కేంద్రం తెలంగాణకు రూ.1.68 లక్షల కోట్లు ఇచ్చిందని తెలిపారు. ఇది నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. నాలుగేళ్లలో కరీంనగర్‌కు బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజరాజేశ్వరస్వామికి కనీసం రూ.10 చందా అయినా రాయించారా? అంటూ మండిపడ్డారు. సిరిసిల్ల నుంచి విజయయాత్ర ప్రారంభించి, కరీంనగర్ లో గులాబీ జెండాను ఎగురవేద్దామన్నారు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచినోళ్లు, నల్లచట్టాలు తెచ్చి రైతులను చంపినోళ్లు దేవుడట అని ప్రధాని మోదీని ఉద్దేశించి కేటీఆర్ విమర్శలు చేశారు.
KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?
TSWRES Inter Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?
TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు
Republic Day Celebrations 2023: రిపబ్లిక్ డే పరేడ్ లో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ ఎన్సీసీ క్యాడెట్స్ - ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీ
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!