Raja Singh: బీజేపీకి రాజా సింగ్ రాజీనామా - పార్టీ అధ్యక్ష పదవి దక్కకపోవడంతో అసంతృప్తి
Telangana BJP: బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లుగా రాజాసింగ్ ప్రకటించారు. అధ్యక్ష పదవిని ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Raja Singh announces resignation from BJP: తెలంగాణ బీజేపీకి రాజాసింగ్ రాజీనామా ప్రకటించారు. అధ్యక్ష పదవి కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. పట్టించుకోకపోవడంతో రాజీనామాకు సిద్ధమయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును హైకమాండ్ ప్రకటించింది. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజాసింగ్ తెలిపారు. రాజీనామా లేఖలను కిషన్ రెడ్డికి ఇచ్చానన్నారు. పార్టీ సింబల్ పై గెలిచినందున రాజీనామా లేఖ కిషన్ రెడ్డికి ఇచ్చానని ఆయన స్పీకర్ పంపాలన్నారు. మీకో దండం.. మీ పార్టీకో దండం అని రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం సర్వం త్యాగం చేశానని.. టెర్రరిస్టులకు టార్గెట్ అయ్యానన్నారు. బీజేపీకి రాజీనామా చేసినా హిందూత్వం కోసం పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడుతున్నామన్నారు. బీజేపీ అధికారంలోకి రావొద్దనేవారు పార్టీలో ఎక్కువగా ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు నామినే,న్ వేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని రాజాసింగ్ ఆరోపించారు. అధికారికంగా రామచంద్రరావు పేరు ప్రకటించక ముందు కూడా రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నావాడు, నీవాడు అంటూ నియమించుకుంటూ పోతే బీజేపీకే తీవ్ర నష్టం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలి. అయితే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. కానీ పార్టీ పట్టించుకోకపోడంతో రాజీనామా చేశారు.
హిందత్వ వాదంలో ఘాటైన వాదన వినిపించే రాజాసింగ్ పాతబస్తీలో మజ్లిస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. గోషామహల్ నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనపై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టింది. మైనార్టీలను రెచ్చగొట్టేలా కార్యక్రమాలు చేపట్టారని ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో బీజేపీ కూడా సస్పెండ్ చేసింది.జైలు నుంచి విడుదలైన తర్వాత..ఎన్నికల అభ్యర్థిగా ఖరారు చేసే ముందే.. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేశారు.
బీజేపీలో అధ్యక్ష సమరం
— PolyTricks (@PolyTricks_in) June 30, 2025
బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్
రామచందర్ ను అధ్యక్షుడిగా నియమించడంపై రాజాసింగ్ అలక
రామచందర్ ను అధ్యక్షుడిగా అంగీకరించం- రాజాసింగ్
రాజీనామా లేఖ కిషన్‌రెడ్డికి అందజేసిన రాజాసింగ్
బీజేపీ గెలవకూడదనుకునే వాళ్లు పార్టీలో ఎక్కువయ్యారు
అధ్యక్ష పదవికి… pic.twitter.com/dNBXu4pbCR
ఇటీవలి కాలంలో రాజాసింగ్ తెలంగాణ బీజేపీ నాయకత్వంపై, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వంటి సీనియర్ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని, పార్టీని "అమ్ముకుంటున్నారని" ఆయన ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలో పారదర్శకత లేదని, కొందరు నాయకులు తమ గ్రూప్‌లను ఏర్పాటు చేసుకుని పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.





















