అన్వేషించండి

Ramachander Rao: నక్షలైట్ల బాధితుడి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి.. ఎవరీ రామచందర్ రావు!

తెలంగాణ బీజేపీి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్న సీనియర్ నేత రామచంద్రరావు రాజకీయం ప్రస్దానం వినూత్నం. బ్రహ్మణ కుటుంబంలో పుట్టి, పోలీసుల లాఠీ దెబ్బలు భరించి, నేడు టీబీజేపీ రథసారధిగా పగ్గాలు చేపట్టారు.

ఉస్మానియా వర్శిటీలో విద్యార్ధి సంఘాల ప్రభావం అంతా ఇంతా కాదు. విద్యార్ధి సంఘాల నాయకులుగా పనిచేసిన వారే ఆ తరువాత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా అనేక పదవులు చేపట్టారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ న్యాయవాది రామచందర్ రావు పేరును జాతీయ నాయకత్వం ఖరారు చేసింది. రెండు దశాబ్దల క్రితం వరకు విద్యార్ధి సంఘాల పోరాటాలు, విద్యార్ధి సంఘం ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలకు మించి ఉత్కంఠగా సాగేవి. ముఖ్యంగా ఈ నేపథ్యంలో అసలు ఎవరీ రామచంద్రరావు? బీజేపీ నాయకత్వం ఆయన పేరునే కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేట్ చేసిందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ప్రత్యర్థులు రామచంద్రరావును సోషల్ మీడియా, యూ ట్యూబ్ ఛానల్స్ లో డమ్మీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని ఎన్.రామచంద్రరావు విద్యార్ధి, రాజకీయ నేపథ్యంపై వాస్తవాలు మీ ముందుంచుతున్నాం.

పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న రామచంద్రరావు..

ఎన్.రామచంద్రరావు అంటే న్యాయవాదిగా, మాజీ ఎమ్మెల్సీగా మాత్రమే ఈ తరానికి తెలుసు. కానీ విద్యార్ధి రాజకీయాల్లోనే రామచంద్రరావు ఒక సంచలనం. అందులోనూ ఉస్మానియా యూనివర్శిటీలో ఏబీవీపీ మనుగడలో లేని సమయంలో రామచంద్రరావు ఏబీవీపీలో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1977 నుండి 80 వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ చదువుతూ 3 ఏళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఓవైపు ఉద్యమాలు చేస్తూనే మరోవైపు ఎం.ఏ (1980–82), ఎల్‌.ఎల్‌.బీ (1982–85) పూర్తి చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా (1977–85) నగర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.

రామచంద్రరావు తండ్రి ప్రొఫెసర్. ఉస్మానియా వర్శిటీ పరిధిలోనే నివాసం ఉండేవారు. బ్రాహ్మణ కుటుంబం కావడంతో ఉద్యమాలకు స్వతహాగా దూరంగా ఉండేవారు. కానీ రామచంద్రరావు మాత్రం ఏబీవీపీలో ఉంటూ విద్యార్ధుల పక్షాన ఉద్యమాలకు నాయకత్వం వహించడమే రాడికల్ స్టూడెంట్స్ తో నేరుగా తలపడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి. 1975 నుండి 95 వరకు తెలంగాణ పూర్తిగా మావోయిస్టులకు అడ్డగా మారిన సమయం. రాడికల్స్ హవా నడుస్తున్న సమయంలోనే వారికి ఎదురొడ్డి పోరాడిన నాయకుడు.

ఉస్మానియా వర్శిటీ లైబ్రరీలో రామచంద్రరావు ఉన్న సమయంలో ఏకంగా నక్సలైట్లు అక్కడికి వచ్చి రామచంద్రరావుపై తీవ్రంగా దాడి చేయడమే కాకుండా కాళ్లు, చేతులు విరగ్గొట్టి వెళ్లారు. దాదాపు రెండు నెలలపాటు ఆసుపత్రిలో మంచానికే పరిమితమైన రామచంద్రరావు ఆ తరువాత రాడికల్స్ కు వ్యతిరేకంగా మరింత ఉధ్రుతంగా పోరాటాలు చేశారు. విద్యార్ధుల పక్షాన ఉద్యమాలు చేసిన రామచంద్రరావుపై అటు రాడికల్స్ తోపాటు ఇటు పోలీసుల చేతిలోనూ పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నారు.

న్యాయవాదిగా ఉద్యమకారులకు అండగా..

1986లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన, జిల్లా కోర్టులు, నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ సేవలందించారు. 2012లో హైకోర్టు ఆయనను సీనియర్ అడ్వకేట్ గా గుర్తించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో, హైకోర్టులు, ట్రిబ్యూనల్స్‌లలో క్రిమినల్, సివిల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజల పక్షాన అనేక కేసులు వాదించి గెలిచారు. ఇక బీజేపీ నేతలకు న్యాయ సహాయం విషయంలో రామచంద్రరావు ఎప్పుడూ ముందుండే వారు. ప్రజా సమస్యలపై, పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమాలు చేసి జైలు పాలైన బీజేపీ నేతల పక్షాన న్యాయపోరాటం చేసి జైలు నుండి బయటకు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు.

రామచంద్రరావు రాజకీయ ప్రస్తానం...

1986లో బీజేపీలో చేరి హైదరాబాద్ లోని రవీంద్రనగర్ డివిజన్ నుండి కార్పొరేటర్ గా పోటీ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా (1980–82), నగర ఉపాధ్యక్షుడిగా (1986–90) పనిచేశారు. బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్‌లో రామచంద్రరావు క్రియాశీల పాత్ర పోషించారు. లీగల్ సంయుక్త కన్వీనర్ (1999–2003), కన్వీనర్ (2003–06)గా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ లీగల్ సెల్ సంయుక్త కన్వీనర్ (2006–10), బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా (2007–09), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (2009–12), ముఖ్య అధికార ప్రతినిధిగా (2012–15) పనిచేశారు. 2015లో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై 2021 వరకు ఫ్లోర్ లీడర్గా సేవలందించారు. బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా పనిచేశారు రామచంద్రరావు.

వివాదాలకు దూరం.. విధేయతకు కేరాఫ్ అడ్రస్..

ఎన్.రామచంద్రావుకు పార్టీలో, బయట కలుపుగోలు మనిషిగా పేరుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరితో నవ్వుతూ సఖ్యతగా మాట్లాడే నాయకుడు. పాత, కొత్త తరం నాయకులందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం ఆయన సొంతం. రామచంద్రరావు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులుంటాయని, టెన్షన్ మటుమాయమవుతుందని పార్టీ నేతలంతా సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. విధేయతకు కేరాఫ్ అడ్రస్ గా రామచంద్రరావు నిలుస్తారని, హైకమాండ్ ఒక పని అప్పగించిందంటే అది పూర్తి చేసేదాకా కష్టపడతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ఇలా పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వివాందాలకు దూరంగా ఉండటంతోపాటు , పార్టీపై పెట్టుకున్న నమ్మకం, కష్టపడే తత్వం ఈరోజు రామచంద్రరావును బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో నిలిపాయంటూ సన్నిహితులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget