Weather Updates: రెయిన్ అలర్ట్ - ఏపీలో అక్కడ భారీ వర్షాలు, తెలంగాణలో ఆ ప్రాంతాలకు IMD వర్ష సూచన - ఎల్లో అలర్ట్ జారీ
Weather Updates In AP Telangana: నేడు ఏపీలోని కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
Southwest Monsoon: నైరుతి రుతుపవనాల తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విస్తరించడంతో పలు జిల్లాల్లో మంగళవారం తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అల్పపీడన ద్రోణి ఉత్తర భారత ద్వీపకల్ప 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి గాలులకోత సగటు సుమద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఏపీలోని కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుల సూచన ఉంది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో పాటు యానాంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. జిల్లాల్లోని కొన్ని చోట్ల మాత్రం కేవలం తేలికపాటి జల్లులు పడతాయి. విశాఖ నగరలోని పలు భాగాలు ముఖ్యంగా సింహాచలం వైపు, గోపాలపట్నం, గాజువాక వైపుగా మంగళవారం మోస్తరు వర్షాలు కురిశాయి. పశ్చిమ గోదావరి, కొనసీమ జిల్లాలు, అనకాపల్లి జిల్లాలోకి వర్షాలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు అధికంగా ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి వచ్చే మేఘాల వల్ల కర్నూలు, నంద్యాల జిల్లాలో వర్షాలు పెరగనున్నాయని, మరోవైపు విజయవాడలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలే అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.
District forecast and warnings for Andhra Pradesh dated 28.06.2022 pic.twitter.com/O6fCoA9TNB
— MC Amaravati (@AmaravatiMc) June 28, 2022
హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) June 28, 2022
తెలంగాణలో వర్షాలు
రాష్ట్రంలో నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. కానీ భారీ వర్ష సూచన లేదు. తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.
Also Read: T HUB Opening KCR : స్టార్టప్ ఆప్ క్యాపిటల్‌గా హైదరాబాద్ - టీ హబ్‌తో యువ వ్యాపారవేత్తలు వస్తారన్న సీఎం కేసీఆర్ !
Also Read: Temples In AP: ఏపీలో దేవాలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం- అధికారులకు ఆగస్టు వరకే డెడ్‌లైన్