Property Tax In Telangana: ఆస్తి పన్నుపై రాయితీ కావాలా - అయితే మీకు గుడ్‌న్యూస్, అలా చేసిన వారికే డిస్కౌంట్

Property Tax In Telangana: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పురపాలక, నగరపాలక సంస్థల్లో (GHMC) ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించేవారికి పన్ను రాయితీ కల్పించింది.

FOLLOW US: 

Discount on Property Tax In Telangana: పన్ను చెల్లింపుదారులకు తెలంగాణ పురపాలక శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పురపాలక, నగరపాలక సంస్థల్లో (Greater Hyderabad Municipal Corporation) ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించేవారికి పన్ను రాయితీ కల్పించింది. ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం పన్ను రాయితీని కల్పిస్తున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 30వ తేదీలోపు ఆస్తి పన్ను చెల్లించేవారికి ఎర్లీబర్డ్ ఆఫర్ (Property Tax Early Bird Scheme) వర్తిస్తుందని పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్‌.సత్యనారాయణ తెలిపారు.

వారికి మాత్రమే ఆఫర్ వర్తింపు 
2022-23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో  ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించేవారికి 5 శాతం పన్ను రాయితీ లభిస్తుంది. తద్వారా  128 పురపాలక సంఘాలు, 13 నగరపాలక సంస్థల్లో ఈ నెల 30లోపు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేవారికి ముందస్తు చెల్లింపు రాయితీ అవకాశం వర్తిస్తుందని పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్‌.సత్యనారాయణ తెలిపారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాయితీ పొందాలని సూచించారు. 

జీహెచ్ఎంసీలో చెల్లింపుల జోరు...
ముందస్తు చెల్లింపు పన్ను రాయితీ ప్రకటించగానే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుల జోరు పెరిగింది. కేవలం రెండు రోజుల్లోనే జీహెచ్ఎంసీ పరిధిలో రూ.13.90 కోట్ల ఆదాయం సమకూరింది. 34,540 మంది ఆన్‌లైన్‌లో తమ ఆస్తి పన్నును చెల్లించారు. జీహెచ్ఎంసీ సైతం ఇదివరకే ఇంటి యజమానులకు సందేశాలు పంపించింది. 5 శాతం రిబేట్ కోసం వారు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ ప్రాపర్టీ ట్యాక్స్ ముందే కడుతున్నారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ వాసులు జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీసెస్ సెంటర్స్, మీసేవా సెంటర్స్, ఏదైనా బిల్ కలెక్టర్స్ ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలని పురపాలక శాఖ సూచించింది. 

గతేడాది సిరిసిల్ల టాప్..
గత ఆర్థిక సంవత్సరం 2021-22 లో రాష్ట్రంలో రూ.698 కోట్ల మేర ఆస్తిపన్ను వసూలైనట్లు సమాచారం. పురపాలక శాఖ తీసుకున్న నిర్ణయంతో దాదాపుగా లక్ష్యాన్ని చేరుకున్నారు. గత ఏడాది తరహాలోనే ఈ సారి ఆస్తులకు క్యూఆర్‌ కోడ్‌ (QR Code) ఆధారంగా నోటీసులు ఇవ్వడం ద్వారా అన్‌లైన్‌లో యజమానులు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే అవకాశం కలిగింది. గత ఏడాది 99 శాతం ఆస్తి పన్ను వసూలుతో సిరిసిల్ల పురపాలక సంఘం మొదటి స్థానంలో నిలిచింది. మెట్‌పల్లి, హుస్నాబాద్‌, అలంపూర్‌, కోరుట్ల 97 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నగరపాలక సంస్థల్లో కరీంనగర్‌ 95 శాతం ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. అత్యల్పంగా అచ్చంపేట, మందమర్రి, ఎల్లారెడ్డి పురపాలికల్లో 60 శాతానికన్నా తక్కువగా ఆస్తి పన్ను చెల్లింపులు జరిగాయి.

Also Read: Telangana Police Jobs: బీ అలర్ట్ - నేడు పోలీస్ జాబ్‌ ఫ్రీ కోచింగ్‌ ఎగ్జామ్, గంట ముందే ఎగ్జామ్ సెంటర్‌లో ఉండాలి

Also Read: Petrol-Diesel Price, 5 April: వాహనదారుల్లో పెట్రోల్ డీజిల్ ధరల కలవరం, నేడు మరింతగా ఎగబాకిన రేట్లు - తగ్గిన క్రూడాయిల్ ధర

Published at : 05 Apr 2022 07:41 AM (IST) Tags: telangana GHMC Property Tax Property Tax In Telangana Rebate on Property Tax

సంబంధిత కథనాలు

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు

Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

టాప్ స్టోరీస్

Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 28th May 2022:  ఈ రాశులవారు తమ పనిని  పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్ 

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్