అన్వేషించండి

Instagram Reels: డీమార్ట్ లో ఫ్రీగా చాక్లెట్స్ ఇలా తినాలంటూ రీల్స్ - యువకుడికి షాక్ ఇచ్చిన పోలీసులు

Free Chocolates Reel: రీల్స్ మోజులో పడి ఓ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. డీమార్ట్ లో ఫ్రీగా చాక్లెట్స్ తినడం ఇలా అంటూ వీడియో తీయగా.. సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Case on Young Man Who Make Insta Reel on How to Eat Dmart Free Chocolates: ప్రస్తుతం యువత సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు. తక్కువ టైంలో పాపులారిటీ కావాలనే ఉద్దేశంతో వింతగా ప్రవర్తిస్తూ.. ఆ పిచ్చి చేష్టలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటివరకూ మెట్రోలో రీల్స్ చేయడం, బహిరంగంగా డ్యాన్స్ చేయడం వంటి వాటినే మనం చూశాం. కానీ, ఓ యువకుడు డీ మార్ట్ (Dmart) లో విచిత్రంగా దొంగతనం చేశాడు. 'బిల్ కట్టకుండా ఓ చాక్లెట్ చోరీ చేసి అక్కడే తినడం ఎలా.?' అనే టైటిల్ పెట్టి ఇన్ స్టా రీల్ చేశాడు. అది కాస్తా వైరల్ కావడంతో పోలీసులు సదరు యువకునిపై చర్యలు చేపట్టారు. 

ఇదీ జరిగింది.

ఇటీవల హనుమాన్ నాయక్ (22) (Hanuman Nayak) అనే యువకుడు స్నేహితులతో కలిసి షేక్ పేటలోని డీ మార్ట్ సూపర్ మార్కెట్ కు వెళ్లాడు. అక్కడ అమ్మే చాక్లెట్లను డబ్బులు చెల్లించకుండా ఎలా తినాలో చూపించి ఫేమస్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ 2 చాక్లెట్లు తీసుకుని.. ఓ షర్టు తీసుకున్నాడు. అనంతరం ట్రైల్ రూంలోకి వెళ్లి చాక్లెట్స్ తిని అనంతరం చాక్లెట్ కవర్ షర్ట్ లో పెట్టి తెచ్చిన చోటే తిరిగి పెట్టేశాడు. అంతే కాకుండా 'బిల్లు చెల్లించకుండా ఫ్రీగా చాక్లెట్స్ ఎలా తినాలో తెలుసా.?' అంటూ ఇన్ స్టాతో పాటు ఇతర సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కాగా.. డీమార్ట్ బ్రాంచ్ మేనేజర్ అర్జున్ సింగ్ బుధవారం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చాక్లెట్లు దొంగిలించిన హనుమాన్ నాయక్, అతని స్నేహితులపై ఐపీసీ సెక్షన్ 402, 379, ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

డీ మార్ట్ మొత్తం సీసీ కెమెరా సర్వేలెన్స్ లో ఉండగా.. ట్రైల్ రూంలో మాత్రం సీసీ కెమెరాలు ఉండవు. దీంతో ఈ లాజిక్ నే హనుమంత్ నాయక్ వాడుకొని రీల్స్ చేసి వ్యూస్ పెంచుకోవాలనుకున్నాడు. చివరకు కథ అడ్డం తిరిగి పోలీసులకు చిక్కాడు.

Also Read: Shiva Balakrishna Arrested: హెచ్‌ఎండీఏ అవినీతి అనకొండ శివబాలకృష్ణ అరెస్టు- ఇంకా కొనసాగుతున్న అక్రమాస్తుల మదింపు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Janga Krishnamurthy: టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
Ticket Price Hike: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
Pawan Kalyan Sankranti Celebrations: సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Janga Krishnamurthy: టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
Ticket Price Hike: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
Pawan Kalyan Sankranti Celebrations: సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
Kantara Chapter 1 : ఆస్కార్ బరిలో కాంతార 1, మహావతార్ నరసింహ - మరో కీలక అప్డేట్... ఇండియా నుంచి మూవీస్ లిస్ట్ ఇదే!
ఆస్కార్ బరిలో కాంతార 1, మహావతార్ నరసింహ - మరో కీలక అప్డేట్... ఇండియా నుంచి మూవీస్ లిస్ట్ ఇదే!
IPAC Case in High Court: ఐ ప్యాక్‌ కేసుపై కోల్‌కతా హైకోర్టులో గందరగోళం, న్యాయమూర్తి వాకౌట్‌, విచారణ వాయిదా!
ఐ ప్యాక్‌ కేసుపై కోల్‌కతా హైకోర్టులో గందరగోళం, న్యాయమూర్తి వాకౌట్‌, విచారణ వాయిదా!
The Raja Saab: అభిమానులతో ఆటలు... ప్రభాస్ 'రాజా సాబ్'కు ఇంత దారుణమైన రిలీజా?
అభిమానులతో ఆటలు... ప్రభాస్ 'రాజా సాబ్'కు ఇంత దారుణమైన రిలీజా?
Embed widget