Shiva Balakrishna Arrested: హెచ్ఎండీఏ అవినీతి అనకొండ శివబాలకృష్ణ అరెస్టు- ఇంకా కొనసాగుతున్న అక్రమాస్తుల మదింపు
HMDA Director Shiva Balakrishna Arrested: హైదరాబాద్‌లో ఏసీబీకి చిక్కిన రేరా కార్యదర్శి, Hmda డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
RERA Secretary Shiva balakrishna is arrested: హైదరాబాద్‌లో ఏసీబీకి చిక్కిన అవినీతి అనకొండను అధికారులు అరెస్టు చేశారు రేరా కార్యదర్శిగా ఉన్న శివబాలకృష్ణ(Shiva Balakrishna) నివాసాల్లో బుధవారం ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో బారీగా అక్రమ ఆస్తులు వెలుగు చూశాయి. దీంతో ఆయన్ని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.
హైదరాబాద్ మున్సిపల్ డెవలప్ మెంట్ పట్టణ ప్రణాళిక విభాగం (Hmda) డైరెక్టర్‌గా, రేరా కార్యదర్శిగా పని చేస్తున్న శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా చూసిన జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి వందల కోట్లు ఆస్తులు సంపాదించారంటే ముక్కున వేలేసుకుంటున్నారు. బుధవారం ఆయన నివాసాల్లో దాడులు చేసిన ఏసీబీ అధికారులకు దిమ్మదిరికే ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వంద కోట్లకుపైగా ఆస్తులు వెలికి తీశారు.
శివబాలకృష్ణ నివాశాల్లో సుమారు 14 బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఆయనకి ఉన్న ఇళ్లు, బంధువులు ఇళ్లల్లో కూడా సోదాలు జరిపారు. ప్రస్తుతం అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం వంద కోట్లపై ఆస్తులు గురించారు. ఇంకా చాలా ఆస్తులు మదింపు చేయాల్సి ఉంది. బ్యాంకు లాకర్లు తెరవలేదని అంటున్నారు. అవి తెరిస్తే ఇంకా ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు వెలుగులోకి వస్తాయో అన్న అనుమానం ఉంది.
బుధవారం ఉదయం మొదలైన తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆయన ఇంట్లో క్యాష్ కౌంటింగ్ యంత్రాలు పెట్టి మరీ డబ్బులు లెక్కించారు. తవ్వే కొద్ది వెలుగులోకి వస్తున్న ఆయన అక్రమాస్తుల గుట్టలను చూసిన అధికారులు షాక్ తిన్నారు. చివరకు ఆయన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
నగదు 40 లక్షలు, రెండు కిలోల బంగారం
ప్రస్తుతం శివబాలకృష్ణ హెచ్ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ తో పాటు మెట్రో రైల్ ప్లానింగ్ అధికారి, రెరాలో కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లెక్కిస్తున్న కొద్దీ నోట్ల కట్టలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.40లక్షల నగదు, రెండు కిలోల బంగారం, 60 ఖరీదైన వాచ్ లు, 14 విలువైన మొబైల్ ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లు గుర్తించారు. దీంతో పాటు స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాంకు లాకర్లు, బంధువుల ఇళ్లలో సోదాలు ముగిసిన తర్వాత ఆస్తుల వివరాలను చెబుతామని అధికారులు తెలిపారు. రాజకీయ నేతల అండదండలతో పాటు ఉన్నతాధికారుల సహాకారంతోనే కోట్లకు పడగలెత్తినట్లు తెలుస్తోంది. కొనసాగిస్తోంది.