Piyush Goyal Vs TRS : ఇతర రాష్ట్రాల్లో తినని బియ్యం ఏం చేసుకుంటాం - తెలంగాణ సర్కార్ ధమ్కీలు ఇస్తోందని పీయూష్ గోయల్ విమర్శలు
తెలంగాణ సర్కార్ ధమ్కీలు ఇస్తోందని రాజ్యసభలో పీయూష్ గోయల్ ఆరోపించారు. పంజాబ్ తరహాలో అందరూ తినే బియ్యం ఇస్తే సెంట్రల్ పూల్ కి మిగులు బియ్యం తీసుకుంటామన్నారు.
తెలంగాణలో ధాన్యం సేకరణ అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సీఎం ద్వారా తమకు ధమ్కీలు ఇస్తున్నారని పీయూష్ గోయల్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వమే పారాబాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రంతో ఒప్పందం చేసుకుందన్నారు. ఇప్పుడు పంజాబ్ తరహాలో మొత్తం కొనాలని కేసీఆర్ లేఖ రాశారని పీయూష్ గోయల్ వివరించారు. పంజాబ్ తరహాలో ముడి బియ్యం కొనుగోలు చేయాలంటే.. ఆ రాష్ట్రం ఉత్పత్తి చేసే తరహా బియ్యాన్ని ఉత్పత్తి చేయాలన్నారు. పంజాబ్‌లో పండే బియ్యాన్ని దేశం మొత్తం తింటారని అలాంటి ముడి బియ్యం ఇస్తే తీసుకుంటామన్నారు.
హుజూరాబాద్‌లో గెల్లు Vs కౌశిక్! హాట్ టాపిక్‌గా TRS నేతల తీరు, ఫోకస్ చేసిన అధిష్ఠానం
ఇతర రాష్ట్రాలలో తినగలిగే బియ్యాన్ని మాత్రమే సెంట్రల్ పూల్ కింద కేంద్రం తీసుకుంటుందన్నారు. అవసరం లేకుండా బియ్యం తీసుకుని కేంద్రం ఏం చేయాలని పీయూష్ గోయల్ ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ముడి బియ్యాన్ని కొనుగోలు చేసి ఎగుమతి చేసే పరిస్థితి లేదన్నారు. ఆహార భద్రతకింద తీసుకునే ముడి బియ్యాన్ని ఎగుమతి చేయలేమని... ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు అనుకూలించవని స్పష్టం చేశారు. ఒక వేళ మిగులు బియ్యం ఉంటే ఆయా రాష్ట్రాల్లోనే పంపిణీ చేసుకోవాలన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో పీయూష్ గోయల్ ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌లోనే కేసీఆర్ ! ఢిల్లీ టూర్ ఎందుకు వాయిదా పడిందంటే
పీయూష్ గోయల్ తీరుపై రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేత కేకే మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం అయోమయం సృష్టిస్తోందని మండిపడ్డారు. పారాబాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుదందని పీయూష్ గోయల్ చెబుతున్నారని.. అందులో ధాన్యం కొనుగోలు చేయాలని కూడా ఉందని కేకే చెప్పారు. ధాన్యం అంశంపై కొద్ది రోజులుగా టీఆర్ఎస్ - బీజేపీ మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.
యాదాద్రికి వెళ్తున్నారా? ఇలా వెళ్తే కొండపైకి పోనివ్వరు! రేపటి నుంచే కొత్త రూల్: ఈవో
ఇటీవల పీయూష్‌గోయల్‌తో జరిగిన సమావేశంలో తెలంగాణ మంత్రులు వాగ్వాదానికి కూడా దిగారు. ధాన్యం మొత్తం కొనుగోలు చేసే వరకూ యుద్ధం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో పార్లమెంట్‌లో పీయూష్ గోయాల్ చేసిన వ్యాఖ్యలు మరింత వేడి రాజేసే అవకాశం కనిపిస్తోంది .