By: ABP Desam | Updated at : 20 Apr 2022 08:21 AM (IST)
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Price Today 20th April 2022:గత మూడు వారాల నుంచి ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. దాంతో వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. గత మూడు నెలలుగా నిలకడగా ఉన్న ఇంధన ధరలు ప్రస్తుతం రోజువారీగా పెరుగుతూ జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 20th April 2022) రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి.
గత డిసెంబర్ తొలి వారం నుంచి మార్చి మూడో వారం వరకు దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఇక్కడ ధరలు పెరుగుతున్నాయి. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధరలు పెరగడంతో భారత్‌లో ప్రభావం చూపుతోంది.
తెలంగాణలో ఇంధన ధరలు..
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది. వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119 కాగా, డీజిల్‌పై లీటర్ ధర రూ.105.02 గా ఉంది.
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.119.19 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.20 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) భారీగా పెరిగాయి. నేడు కరీంనగర్‌లో 46 పైసలు పెరిగి, పెట్రోల్ లీటర్ ధర రూ.119.68 కాగా, 42 పైసలు పెరిగి డీజిల్ ధర రూ.105.65కు చేరింది.
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 51 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.121.49 కాగా, డీజిల్‌పై 48 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.107.35కి చేరింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో ఇంధన ధరలు తగ్గాయి. ఇక్కడ పెట్రోల్ (Petrol Price in Vijayawada 20th April 2022)పై 49 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.121.19 కాగా, ఇక్కడ డీజిల్ పై 46 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.106.80 అయింది.
విశాఖపట్నంలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.120 అయింది. డీజిల్‌పై 23 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.65గా ఉంది.
చిత్తూరులో పెట్రోల్ లీటర్ రూ.122.19 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.107.68 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
ధరల పెరుగుదలకు కారణం..
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై పడి వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. దాని ప్రభావం పలు దేశాలపై పడింది. భారత్‌లోనూ ఇంధన ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.150 నుంచి రూ.180కి పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Karimnagar News: కరీంనగరం జిల్లా ప్రజలకు మరో గుడ్ న్యూస్- జూన్ 2 నుంచి అందుబాటులోకి సరికొత్త సాహస క్రీడ
KTR TODAY : సద్గురు " సేవ్ సాయిల్" ఉద్యమానికి కేటీఆర్ సపోర్ట్ - దావోస్‌లో కీలక చర్చలు !
Konseema Protest Live Updates: కోనసీమ జిల్లా అంతటా కర్ఫ్యూ- ఆందోళనతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త
Maneroo River Front : మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్ ఏమన్నారంటే?
Petre Rates States : పెట్రో పన్నులపై రగడ ! ఎప్పుడూ కేంద్రమేనా రాష్ట్రాలు తగ్గించవా ?
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!