Petrol-Diesel Price, 1 November 2021: మళ్లీ పెట్రో బాదుడు.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి ధరలు ఇలా..
దేశంలో ఏది పెరిగినా పెరగకపోయినా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పుంజుకున్నాయి. వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది.
Petrol-Diesel Price, 1 November 2021: ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా నేడు కూడా కొన్ని నగరాల్లో వ్యత్యాసం చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో నేడు పెట్రోల్ ధర 35 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ. 109.69 అయింది. డీజిల్ పై35 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.98.42కు చేరింది. హైదరాబాద్‌లో వరుసగా మళ్లీ ఇంధన ధరలు పెరిగాయి. నగరంలో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.40 పైసలు పెరిగి రూ.114.12 అయింది. డీజిల్ ధర లీటరుకు రూ.0.42 పైసలు పెరిగి రూ.107.40గా ఉంది. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.59 పైసలు పెరిగి రూ.113.83 అయింది. డీజిల్ ధర రూ.0.59 పైసలు పెరిగి రూ.107.11 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.41 పైసలు పెరిగి.. రూ.114.31గా ఉంది. డీజిల్ ధర రూ.0.42 పైసలు పెరిగి రూ.107.56 కు చేరింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.73 పైసలు పెరిగి రూ.116.08 గా ఉంది. డీజిల్ ధర రూ.0.73 పైసలు పెరిగి రూ.109.22 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
Also Read: Paytm IPO: పేటీఎం ఐపీవోకు సెబీ అనుమతి.. షేర్ల ధర, విలువ, లిస్టింగ్ వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు తాజాగా పెరిగాయి. పెట్రోల్ పై 0.33 పెరగడంతో లీటర్ ధర ప్రస్తుతం రూ.116.27 గా ఉంది. డీజిల్ ధర రూ.0.34 పైసలు పెరగ రూ.108.89కి చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.115.06గా ఉంది. గత ధరతో పోలిస్తే లీటరుకు రూ.0.48 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.107.73గా ఉంది. ఇది లీటరుకు రూ.0.48 చొప్పున పెరిగింది.
Also Read: డబ్బు సంపాదించాలంటే ఈ 6 అలవాట్లు చేసుకోండి..! ఆ తర్వాత...!
తిరుపతిలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.70 పైసలు పెరిగి.. రూ.117.25 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.109.76గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.69 పైసలు పెరిగింది. అనంతపురంలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.99 కాగా, లీటర్ డీజిల్ ధర 108.64కు చేరింది.