Paytm IPO: పేటీఎం ఐపీవోకు సెబీ అనుమతి.. షేర్ల ధర, విలువ, లిస్టింగ్ వివరాలు ఇవే
పేటీఎం ఐపీవోకు సెబీ అనుమతి ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఎంతోమంది మదుపర్లు ఐపీవోకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రైస్ బ్యాండ్, ఫేస్ వాల్యూ, లిస్టింగ్ వివరాలను కంపెనీ వివరించింది.
దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పేటీఎం ఐపీవోకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనుమతి ఇచ్చింది. 20 బిలియన్ డాలర్ల విలువతో వన్97 కమ్యూనికేషన్స్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వనుంది. షేర్ల ధరను రూ.2,080 - రూ.2,150 మధ్య నిర్ణయించింది. బుధవారం బీఎస్‌ఈ ఫైలింగ్‌లో ఈ వివరాలను వెల్లడించింది.
పేటీఎం ఐపీవో నవంబర్ 8న మొదలై 10న ముగుస్తుంది. ఫేస్ వాల్యూ ఒక రూపాయిగా ఉంది. ఇష్యూలో 75 శాతం అంటే రూ.13,725 కోట్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ (QIBs)కి రిజర్వు చేసింది. పది శాతం ఇష్యూ అంటే రూ.1830 కోట్లను రిటైల్ బయర్స్‌కు రిజర్వు చేసింది. ముందు రూ.16,600 కోట్ల విలువతో ఇష్యూకు రావాలనుకున్నా తర్వాత రూ.18,300 కోట్లతో వచ్చేందుకు నిర్ణయించుకుంది.
పేటీఎం ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ రూ.10వేల కోట్లు, ప్రెష్ ఇష్యూ రూ.8300 కోట్లుగా ఉంది. స్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, యాంట్ ఫైనాన్షియల్స్, అలీబాబా, ఎలివేషన్ క్యాపిటల్, సైఫ్ త్రి మారీషస్ కంపెనీ, సైఫ్ పార్ట్‌నర్స్‌కు పేటీఎంలో వాటాలు ఉన్నాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో నెట్‌వర్త్‌పై కంపెనీ వెయిటెడ్ యావరేజ్ రిటర్న్ -36.9 శాతంగా ఉంది. పాన్ అనుసంధానమైన బ్యాంకు ఖాతా ద్వారా షేర్లు కొనుగోలు చేయొచ్చు. ఇన్వెస్టర్లు కనీసం ఆరు ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయాలి.
Also Read: Facebook New Name: పేరు మార్చుకున్న ఫేస్‌బుక్.. ఇకపై ‘మెటా’.. ఎందుకంటే?
Also Read: Loan on Credit Card: క్రెడిట్ కార్డుపై రుణమా.. యమ డేంజర్! ఈ విషయాలు తెలుసుకున్నాకే తీసుకోండి!
Also Read: Nykaa IPO Subscription: నైకా ఐపీఓ ఆరంభం.. షేర్ల ధర, కంపెనీ ఫైనాన్షియల్స్ వివరాలు ఇవే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Congratulations to ₹1 Lakh winners from yesterday! 🥳#PaytmCashbackDhamaka
— Paytm (@Paytm) October 29, 2021
🌟The Paytm Gold Diwali is here🌟
— Paytm Gold (@paytmgold) October 27, 2021
Buy Gold and win more Gold!
You could be one of 5000 lucky winners every day🏆
Know More: https://t.co/iQI6ZKhJXq#PaytmGold #YehDiwaliGoldWali #Diwali2021 #GoldIsForever #paytmkaro #DigitalGold pic.twitter.com/2XJIXEMGOy