Minister Harish Rao : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని డబుల్ ఇంజిన్ అభివృద్ధి తెలంగాణలో - మంత్రి హరీశ్ రావు
Minister Harish Rao : తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఉద్యమకారుడు ప్రొ.జయశంకర్ అని మంత్రి హరీశ్ రావు ఉన్నారు. పెద్దపల్లి బస్టాండ్ చౌరస్తా లో ఆచార్య జయశంకర్ వర్ధంతి కార్యక్రమంలో హరీష్ పాల్గొన్నారు.
Minister Harish Rao : పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేశారు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జయశంకర్ తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అని అన్నారు. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, ప్రొఫెసర్ గా సీఎం కేసీఆర్ కు ఆప్తుడుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారని తెలిపారు.తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ రాష్ట్రం ఎందుకు అవసరమో అవగాహన కల్పిస్తూ ఉద్యమాన్ని ఏకతాటిపైకి నడిపించిన ఉద్యమకారుడు జయశంకర్ అని అభివర్ణించారు. నాలుగు దశాబ్దాలు ఉద్యమాన్ని సజీవంగా ఉంచడంలో గొప్ప పాత్ర పోషించారన్నారు. శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను బలంగా బల్లగుద్ది చెప్పిన వ్యక్తి అని కొనియాడారు.తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలు జయశంకర్ కల అన్నారు. అది ఇవాళ తెలంగాణ ప్రజలకే దక్కుతున్నాయన్నారు. డబుల్ ఇంజన్ అనే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని అభివృద్ధి ఈరోజు తెలంగాణలో జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఆచార్యుని సేవలు చిరస్మరణీయం..!
— Harish Rao Thanneeru (@trsharish) June 21, 2022
ఆయన ఆశయాలను కొనసాగిస్తాం..!!
సార్ మన మధ్య లేకున్నా, మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంత కర్త. నీ స్పూర్తిని చెదరకుండా మా గుండెల నిండా పదిలంగా నిలుపుకున్నాం.
జోహార్ జయశంకర్ సార్..! pic.twitter.com/5BEOCIMWzn
యోగా డే ప్రాముఖ్యతపై
యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో సిద్ధిపేట పట్టణం కొండా భూదేవి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన యోగా వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగాను దిన చర్యలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు.ప్రపంచంలో చాలా మందికి ఆహార అలవాట్లతోనే వ్యాధులు వస్తున్నాయన్నారు. యోగాతో రోగాల బారిన పడకుండా ఉంటారన్నారు. యోగా చేస్తూ ఆరోగ్యపర జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు యోగా సాధన చేయవచ్చని మంత్రి చేయవచ్చన్నారు. శారీరక, మానసిక సమస్యల నుంచి కాపాడుకోవచ్చన్నారు. యోగా, వాకింగ్, సూర్య నమస్కారాలు చేస్తే రోజువారీ పనులను మరింత చురుగ్గా చేసుకోవచ్చని మంత్రి హరీశ్ రావు అన్నారు. భారతదేశాన్ని చూసి వివిధ దేశాలు యోగాను నేర్చుకుంటాయన్నారు. యోగా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణులకు యోగాలాంటి శిక్షణ ఇస్తున్నామని ఆయన.. గర్భిణులు యోగాలాంటివి చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువ అన్నారు.