By: ABP Desam | Updated at : 15 Mar 2022 07:14 PM (IST)
మిర్చి,పత్తి రైతుల ఆత్మహత్యలు ఆపండి - కేసీఆర్‌కు రేవంత్ లెటర్ !
తెలంగాణ రాష్ట్రంలో మర్చి, పత్తి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ( CM KCR ) .. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revant Reddy ) బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేకపోవడంతో , రుణ ప్రణాళిక , పంటల కొనుగోళ్లు , నకిలీ, కల్తీ విత్తనాలు , పురుగు మందులు తదితర సమస్యల నేపత్యంలో రైతు అప్పుల పాలై దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రేవంత్ లేఖలో పేర్కన్నారు. రాష్ట్రంలో మిర్చి ( Mirchi ) , పత్తి ( Cotton ) రైతుల పరిస్థితి ఎంతగానో కలచివేస్తోందన్నారు. మహబూబబాద్ ప్రాంతం లో పర్యటించి వచ్చి ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశానన్నారు. ఒక్క మహబూబ్ బాద్ ( Mehabhubabad ) జిల్లాలోనే రెండు నెలల్లో 20 మంది రైతులు ఆత్మహత్యలు ( Farmars Susids ) చేస్కున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ అర్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు.
మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక లు మహబూబాబాద్ ప్రాంతాల్లో పర్యటించి నివేదికలు సమర్పించాయని గుర్తు చేశాకు. రైతులకు ఒక్క ఎకరాకు లక్ష రూపాయల పెట్టుబడి అవుతుంది. ప్రతి రైతు కు 6 నుంచి 12 లక్షల వరకు అప్పు ఉంది. అప్పుల బాధలు భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వెంటనే రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రూ. లక్ష రూపాయల రుణ మాఫీ ( Loan Weaier ) వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల ప్రైవేట్ అప్పుల ( Private Loans ) విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబంలోని. పిల్లలను ప్రత్యేక కేటగిరి కింద గుర్తించి ప్రభుత్వం ఉచితంగా చదివించాలని కౌలు రైతులకు రైతులకు ఇచ్చే అన్ని సౌకర్యాలు కల్పించాలని లేఖలో కోరారు. కల్తీ,నకిలీ పురుగు మందులు నివారణకు తగిన పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలన్నారు. రైతు వేదికలను పునరుద్ధరించి, వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి రైతులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని తన బహిరంగ లేఖలో ( Open Letter ) కోరారు.
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ లైవ్ అప్డేట్స్
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ క్షమాపణలు
తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- త్వరలో గురుకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
MLA Tractor Journey: మొన్న తెప్పపై, నిన్న అడవిలో ట్రాక్టర్‌పై మహిళా ఎమ్మెల్యే - ఎందుకో తెలిస్తే మెచ్చుకుంటారు !
పొదుపు సంఘం నుంచి డబ్బులు తీసుకొని భర్త హత్యకు భార్య కుట్ర- నల్లగొండలో దారుణం
Salman Rushdie: వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ, ఓ కన్ను కోల్పోక తప్పదేమో - న్యూయార్క్ టైమ్స్ కథనం
Sridevi Birth Anniversary: బాలీవుడ్లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రిమేక్స్ ఇవే!
Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి
SI Preliminary Key: ఎస్ఐ అభ్యర్థులకు గుడ్ న్యూస్, అందరికీ 8 మార్కులు, బోర్డు కీలక నిర్ణయం!