అన్వేషించండి

Telangana Elections 2023 : అవినీతిరహిత సామాజిక తెలంగాణ రావాలి - వరంగల్‌లో పవన్ పిలుపు

Telangana Elections 2023 : అవినీతి రహిత సామాజిక తెలంగాణ రావాలని పవన్ కల్యాణ్ వరంగల్‌లో ఆకాంక్షించారు. బీజేపీ అభ్యర్థి రావు పద్మ కోసం ప్రచారం చేశారు.


Telangana Elections 2023 :   బలిదానాలపై ఏర్పడిన తెలంగాణ ఇంత అవినీతిమయం కావడం బాధాకరమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా బుధవారం వరంగల్లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  12 వందల మంది అమరవీరుల స్ఫూర్తితో తెలంగాణ నుంచి పుట్టిన పార్టీ అధికారంలో ఉండాలని ఆకాంక్షించానని చెప్పారు.ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించలేదని అంటున్నారని చెప్పారు. అవినీతి రహిత సామాజిక తెలంగాణ కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. 2009లోనే ఈ ఆకాంక్షతో ఉన్నానని ప్రజాయుద్ధం నౌక, గాయపడ్డ ప్రజల పాట గద్దర్తో ఈ విషయాలు చర్చించానని వివరించారు. అప్పుడే ఆదిలాబాద్ మారుమూల తండాలలో పరిస్థితిని చూసి తల్లడిల్ల అని వివరించారు. కాకపోతే ఆరోజు సాధ్యం కాలేదని చెప్పారు.తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో ఉందో మీకు తెలుసన్నారు. కాళోజి, దాశరధి తనకు స్పూరిదాయకమన్నారు. ఆంధ్రాలో ఎలా తిరుగుతాను తెలంగాణలో అలా తిరుగుతానని హామీ ఇచ్చారు.

తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో ఉందో మీకు బాగా తెలుసు, బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రంలో ఇంత అవినీతి జరగడం దారుణమన్నారు.మొన్ననే పార్టీ మారిన ఒక నాయకుడు బహిరంగంగానే మాట్లాడుతూ తెలంగాణలో 6% నుంచి 8% పర్సంటేజ్ ఇస్తున్నామని నాయకుడు చెప్పడం బాధాకరమని అన్నారు. తెలంగాణ గురించి మాట్లాడితే నా రోమం రోమం నిక్కబడుతుంది, నాలో గుండె ధైర్యం పెరుగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే తెలంగాణకు మద్దతు ఇచ్చానని చెప్పారు. ఏపీలో రౌడీలు రాజ్యమేలుతున్నా, గుండాలు బెదిరిస్తున్నా, డబ్బు లేకపోయినా అంతమందిని తట్టుకొని నిలబడుతున్నానంటే, ఏ బలం లేకపోయినా గుండె ధైర్యంతో పోరాటం చేసే స్పూర్తిని తెలంగాణ నుంచే నేర్చుకుంటున్నాను... నా పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటుందన్నారు. తెలంగాణ అమరవీరులు, పోరాట యోధుల మీద గౌరవం, నాలుగు కోట్ల ప్రజల మీద గౌరవంతో దశాబ్ద కాలం పాటు నోరు విప్పలేదన్నారు. 

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే ప్రధానమంత్రికి, దేశ ఆర్థిక శక్తిని 10వ స్థానానికి తీసుకెళ్లిన ప్రధానమంత్రి పై నాకు ఆపార గౌరవమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రాలో అధికార పార్టీల ప్రశ్నిస్తున్న వాణ్ణి తెలంగాణలో మార్పు కోరుకుంటానన్నారు. బీసీలు ముఖ్యమంత్రి కావాలని కోరారు.  బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను ఒక్కడినన్నారు. తెలంగాణలో జనసేన (Janasena) ఉంటుందని.. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామని తెలిపారు. 2009లో స్థాపించిన పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణమని చెప్పుకొచ్చారు. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో తాను ఒకడిని అని అన్నారు. బీజేపీ అభ్యర్థులు రావుపద్మ, ప్రదీప్ రావును గెలిపించాలని కోరారు. సమస్యలొస్తే తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామని.. బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలని అందుకే బీజేపీతో కలిసినట్లు తెలిపారు. జనసేన - బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.

అద్భుతాలు చేస్తానని చెప్పనుగానీ మోడీ ప్రవేశపెట్టిన పథకాలను వినియోగించుకునేందుకు సిద్ధం కావాలన్నారు. గెలిచిన ప్రజాప్రతినిధులతో పని చేయించుకోవడానికి కృషి చేయాలన్నారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేసుకునే అవకాశం నరేంద్ర మోడీ వల్ల వచ్చిందని, దాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ సభలో బిజెపి వరంగల్ పశ్చిమ తూర్పు అభ్యర్థులు రావు పద్మ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇతర బిజెపి జనసేన నాయకులు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Embed widget