అన్వేషించండి

Pawan Kalyan Telangana Tour: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన - అభిమాని నిరంజన్ ఇంటికి జనసేనాని -కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకుంటాయా?

Congress vs Janasena Telangana: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన ఖరారు అయింది. ఫ్యాన్ నిరంజన్ ను పరామర్శిస్తారు. ఇటీవలి రాజకీయ పరిణామాలతో పవన్ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.

AP Deputy CM Telangana Visit: పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. ఈ పర్యటనకు ఒక ప్రత్యేకమైన, భావోద్వేగ కారణం ఉంది. బుధవారం రోజు  వరంగల్  హనుమకొండలో  మృత్యువుతో పోరాడుతున్న తన వీరాభిమాని  నిరంజన్ చివరి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ అతని ఇంటికి వెళ్లను  పవన్ కల్యామ్‌ను ​ చూడాలనే తన చివరి కోరిక మేరకు అతని ఇంటికి వెళ్లనున్నారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు.

జన్యపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ 

హనుమకొండకు చెందిన నిరంజన్‌కు పదహారేళ్లు.  చిన్నప్పుడు మామూలుగానే ఉండేవాడు. అయితే  కానీ, 8 ఏళ్ల క్రితం అతడి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. జన్యుపరమైన డీఎండీ వ్యాధి బారిన పడి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. ఎదుగుదల పూర్తిగా లోపించింది. కాస్త గట్టిగా పట్టుకుంటే భరించలేని నొప్పి .  ఇటీవల టీవీలో సీఎం రేవంత్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూసిన నిరంజన్‌.. ఆయన్ను, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలవాలనుందని తెలిపాడు. నిరంజన్ కోరికను జనసేన నేతలు, పవన్ అభిమానులు ఆయనకు వివరించారు. ఈ విజ్ఞప్తిని మన్నించిన పవన్ కల్యాణ్ రేపు హనుమకొండ వచ్చి నిరంజన్‌ను పరామర్శించనున్నారు.   జనసేనాని టూర్ నేపథ్యంలో ఆ పార్టీ నేతులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అటు పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోనుంది.   

ఇటీవల రాజకీయ పరిణామాలతో పవన్ పర్యటనపై ఆసక్తి 
 
గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్‌కు మధ్య తీవ్రమైన వాగ్వాదం నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా జనసేన నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ కు పోలీసులు, హైకోర్టు అనుమతి నిరాకరించడం వివాదానికి కేంద్ర బిందువైంది. దీనిపై జూబ్లీహిల్స్ నివాసంలో ప్రెస్ మీట్ పెట్టిన పవన్..  తెలంగాణ ఎవరి సొంత జాగీరు కాదు.. నన్ను హైదరాబాద్ రాకుండా ఆపేదెవరు  అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఢిల్లీ వేదికగా జరిగిన పార్టీ  సేన ప్రస్థానం’ సమావేశంలోనూ..  తెలంగాణ అమరవీరులను గుర్తించడానికి ఈ పాలకులకు 12 ఏళ్లు సరిపోలేదా  అంటూ కాంగ్రెస్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. 

రాజకీయాలకు అతీతంగా పవన్ పర్యటన 

పవన్ కళ్యాణ్ కేవలం అభిమాని నిరంజన్‌ను కలిసి వెళ్ళిపోయినా.. ప్రస్తుతమున్న పొలిటికల్ టెన్షన్స్ దృష్ట్యా దానికి రాజకీయ ప్రాధాన్యత లభించడం ఖాయం.  ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదని పవన్ మాట్లాడటాన్ని, తెలంగాణ సెంటిమెంట్‌ను తక్కువ చేసి చూపడంగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో తిరగడాన్ని తాము అడ్డుకుంటామని ఇప్పటికే కొంతమంది ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పవన్ పర్యటించే నియోజకవర్గం లేదా రూట్ మ్యాప్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలిపే లేదా అడ్డుకునే ప్రయత్నాలుఉన్నాయని భావిస్తున్నారు.
 
ఈ పర్యటన కేవలం ఒక అభిమానిని కలవడం కోసమే కాబట్టి ఎలాంటి రాజకీయ ప్రసంగాలు ఉండకపోవచ్చని జనసేన వర్గాలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ వస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం భద్రత కల్పించాల్సి ఉంటుంది. 


Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget