అన్వేషించండి

Parakala Politics : ధర్మారెడ్డి వర్సెస్ కొండా మురళి - డైలాగ్ వార్ లో లెటెస్ట్ ఏమిటంటే ?

పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, కొండా మురళి మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. దమ్ముంటే పరకాల లో చూసుకుందామని ఇద్దరు నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు.

 

Parakala Politics :   తెలంగాణలో ఎన్నికల వేడి పెరిగే కొద్దీ  కీలకమైన నియోజకవర్గాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు పెరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల కేటీఆర్ పర్యటన తర్వాత ఒక్క సారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఆ పర్యటన సందర్భంగా కేటీఆర్‌ పై కాంగ్రెస్ నేతలు కొండా మురళి, కొండా సురేఖ తీవ్ర విమర్శలు చేయడంతో..  పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి వారికి ఘాటు కౌంటర్ ఇచ్చారు. దాంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం ప్రారంభమయింది. 

దమ్ముంటే పరకాలలో  పోటీ చేయాలని ధర్మారెడ్డి సవాల్                             

దమ్ముంటే వచ్చి పరకాలలో పోటీ చేసి గెలవాలని కాంగ్రెస్ నేత‌లు కొండ మురళి, కొండా సురేఖల‌కు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్ విసిరారు. కొండా మురళి, కొండా సురేఖ భాష మార్చుకోవాలన్నారు. పరకాలలో గెలవలేక వరంగల్ పారిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఉరికించి కొట్టారని, అదే మళ్లీ భవిష్యత్తులో రిపీట్ అవుతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు.  ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 

ధర్మారెడ్డికి వార్నింగ్ ఇచ్చిన కొండా మురళి                                           
 
ధర్మారెడ్డి వ్యాఖ్యలైప  కొండా మురళి స్పందించారు.  అసలు ధర్మారెడ్డికి మా ఇంటి గేటు తెలుసా అంటూ ప్రశ్నించారు. నీ అంతు తేల్చడానికే వచ్చాను నేను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను, కొండా సురేఖ, తన బిడ్డ భాష బాగోలేదని చెప్పడానికి ధర్మారెడ్డి ఎవరని ప్రశ్నించారు.  పైపులు అమ్ముకొని బతికే వాడివని, కడియం శ్రీహరి దగ్గర ఉండి పదవులు పొందిన వాడివని.. నువ్వు కూడా మాట్లాడతావా అని ప్రశ్నించారు.  పరకాలలో  చేసిన అవినీతి, అక్రమాలు ప్రజలను ఎవరు అడిగినా చెబుతారని ..  అలాంటి నువ్వు నాపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు కొండా మురళి. పరకాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చల్లా ధర్మారెడ్డి ఉరికించడం ఖాయమని కొండా మురళి పేర్కొన్నారు. 

పరకాలలో ప్రచారం చేస్తాం.. దమ్ముంటే ఆపాలని సవాల్                                   

చెంచాగిరి అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉందని పేర్కొన్న కొండా మురళి, తాను ఎక్కడికి రావడానికైనా సిద్ధమని డేటు, టైము ఫిక్స్ చేయమని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీలో దొరల పాలన సాగుతుందన్నారు. మైసమ్మ సాక్షిగా కొండ మురళి చెబుతున్నాడు నిన్ను పరకాలలో ఓడగొట్టటం ఖాయమని పేర్కొన్నారు.అధికారం ఎక్కువ రోజులు ఉండదని కొండా మురళి హెచ్చరించారు.  అధికార గర్వం తో మాట్లాడితే దెబ్బ తింటావ్ అని హితవు పలికారు. కొండా మురళి భయపడేవాడు కాదని భయం అనేది తన వంశంలోనే లేదన్నారు. పరకాలలో తాము ధైర్యంగా ప్రచారం చేస్తారని, దమ్ముంటే ఆపాలని సవాల్ విసిరారు. 

వరంగల్ రాజకీయాలు క్రమంగా ఉద్రిక్తంగా మారుతూండటం.. రాజకీయవర్గాలను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. హింసాత్మకంగా మారుతాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Breaking News: హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget