Telangana Congress : గురువారం సాయంత్రం 4 గంటలు - రైతుల మొబైల్స్‌లో మెసెజ్‌ల మోత ఖాయం !
loan waiver : లక్ష రుణమాఫీ నిధులు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. రైతుల ఆత్మగౌరవం కోసమే రుణమాఫీ చేస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Telangana loan waiver News : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెబుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు రూ. 1 లక్ష లోపు పంట రుణాలు మాఫీ అవుతాయి. రూ. 7 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ల ఈ నెలాఖరులోపు లక్షన్నర రుణాలను మాఫీ చేసి వచ్చే నెలలో రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేసి. రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తారు. రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజా భవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రుణమాఫీ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్లి సంబరాలు చేసే అంశంపై దిశానిర్దేశం చేశారు.
రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రూ. 31 వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో జరగలేదని రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు చెప్పారు. రుణమాఫీ చేస్తామని చెప్తే ఇది అసాధ్యం అని చాలా మంది అన్నారని రేవంత్ గుర్తు చేశారు. , ఆర్థిక నిపుణులు కూడా ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని చెప్పారని చిత్తశుద్ధి ఉంటే అన్ని సాధ్యమేనని తాము నిరూపిస్తున్నామన్నారు.
రుణమాఫీ రాహుల్ గాంధీ హామీ అని .. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అందుకే పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. నికర ఆదాయంగా ఉన్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ 28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని గుర్తు చేశారు. లక్ష రుణమాఫీ కోసం ఐదేళ్లలో నాలుగు దఫాలుగా 25 వేల చొప్పున రుణమాఫీ చేశారని విమర్శించారు.
రుణమాఫీ పై ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించేలా బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని వారి ప్రచారాన్ని తిప్పి కొట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు. రుణమాఫీ విషయంలో రైతూ నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి ఈ నిర్ణయాన్ని తీసుకెళ్లాలని పలు సూచనలు చేశారు. రైతు బంధు గురించి రైతులు 20 సంవత్సరాలు చెప్పుకునే విధంగా ప్రక్రియ సాగాలన్నారు. చించారు. రుణమాఫీ పై జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంటు సభ్యులు రుణమాఫీపై ఢిల్లీలో చెప్పాలన్నారు.
రేషన్ కార్డులేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. నాలుగు గంటల తర్వాత గ్రామ స్థాయిలో రుణమాఫీ సంబరాలు జరిగేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు. బైక్ ర్యాలీలు నిర్వహించాలన్నారు.