అన్వేషించండి

Krishna River: వరదా లేదూ, వానా లేదూ - కృష్ణా ప్రాజెక్టుల్లో పడిపోతున్న నీటి మట్టాలు

Krishna River: కృష్ణా ప్రాజెక్టులకు వరద రావడం లేదు. నీటి ప్రవాహం లేక జలాశయాలు వెలవెలబోతున్నాయి. 

Krishna River: కృష్ణా ప్రాజెక్టులకు వరద రావడం లేదు. నీటి ప్రవాహం లేక జలాశయాలు వెలవెలబోతున్నాయి. ప్రాజెక్టుల్లో రోజురోజుకూ నీటి మట్టాలు పడిపోతున్నాయి. గత 15 రోజులుగా కృష్ణా నదిలోకి ప్రవాహాలు లేకపోవడం వల్ల నీటి సమస్యలు తప్పేలా లేవు. సాధారణంగా ప్రవాహం భారీగా కాకపోయినా.. కనీసం ప్రాజెక్టుల కింద అవసరాల మేరకు భర్తీ చేసే స్థాయిలో నీరు ఉండేది. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కనీస స్థాయిల్లోనూ నీటి ప్రవాహం రావడం లేదు. ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు ఈ నెల 10వ తేదీ తర్వాత 20 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినట్లు అధికారులు చెబుతున్నాయి. అయితే ఆయా ప్రాజెక్టుల్లో నీటి స్థాయిలు తక్కువగా ఉండటంతో ఆ 20 వేల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వచ్చే పరిస్థితి లేదు. అయితే జూరాల ప్రాజెక్టుకు మాత్రం స్థానికంగా కురిసన వర్షాల వల్ల స్వల్పంగా ప్రవాహం వచ్చింది. 

శ్రీశైలం ప్రాజెక్టుకు కనీస ఇన్ ఫ్లో కూడా లేదు

శ్రీశైలం ప్రాజెక్టుకు కనీస ఇన్ ఫ్లో కూడా లేదు. ఈ నెల 12వ తేదీ తర్వాత ఇన్ ఫ్లో పూర్తిగా పడిపోయింది. కర్ణాటకతోపాటు రాష్ట్రంలోనూ వర్షాలు లేక ఈ పరిస్థితి తలెత్తింది. జూరాల, తుంగభద్ర నుంచి కూడా ప్రవాహం రావడం లేదు. 12వ తేదీన శ్రీశైలం ప్రాజెక్టులో 122 టీఎంసీల నిల్వ ఉండగా.. ఆదివారం 94 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకుగానూ ప్రస్తుతం 855.90 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. 121.57 టీఎంసీల మేర ఖాళీ ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో తాగు, సాగు నీటి అవసరాలకు స్వల్పంగానే నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. ఈ జలాశయం కింద 15 రోజుల్లో 28 టీఎంసీల వినియోగం నమోదు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

గడ్డు పరిస్థితి ఎదుర్కుంటున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు

నాగార్జున సాగర్ ప్రాజెక్టు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. శ్రీశైలం జలాశయం నుంచి జల విద్యుత్ ఉత్పత్తిలో వస్తున్న ప్రవాహం తప్ప నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రవాహం రావడం లేదు. జల విద్యుత్ ఉత్పత్తి తో విడుదల నీటి వల్ల నాగార్జున సాగర్ లో దాదాపు 9 టీఎంసీల నిల్వ పెరిగింది. స్థానికంగా వర్షాలు లేకపోవడంతో ప్రవాహం లేదు. కాల్వలకు కూడా స్వల్పంగానే నీటిని విడుదల చేస్తున్నారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ పగటిపూట విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాత్రి సమయంలో రివర్స్ పంపింగ్ తో నీటిని ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తోంది.

గోదావరి ప్రాజెక్టుల్లో మాత్రం నీరు పుష్కలంగా ఉంది. మొన్నటి వరకు ఎగువ ప్రాంతాల్లో దట్టంగా కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. నది ఉప్పొంగి ప్రవహించడంతో గోదావరి జలాశయాల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, మధ్య మానేరు, దిగువ మానేరు, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి, ధవళేశ్వరం బ్యారేజీల్లో నీరు ఆశాజనకంగా ఉన్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget