అన్వేషించండి
Advertisement
Revanth Reddy: ప్రపంచం అతలాకుతలమైతే అదానీ ఆస్తులు 819 శాతం ఎలా పెరిగాయి? రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న
కరోనాతో ప్రపంచం అతలాకుతలమైతే 819శాతం ఆదానీ ఆస్తులు పెరిగాయి. 2014 తర్వాత దేశ సంపదను ఆదానీ అంబానీలకు దోచి పెడుతున్నారు. బ్రిటీషర్ లా దేశాన్ని మోదీ కట్టు బానిసను చేస్తున్నాడు.
దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోదీ తన స్నేహితులకు దోచి పెడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కరోనా ప్రభావంతో ప్రపంచం అతలాకుతలమైతే 819 శాతం ఆదానీ ఆస్తుల విలువ పెరిగిందన్నారు. నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ దేశ సంపదను ఆదానీ, అంబానీలకు దోచి పెడుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. దీనిపై రాహుల్ గాంధీ ప్రతి సందర్భంలో చెబుతూ వచ్చారని అన్నారు.
బ్రిటీషర్ నమూనానే ఆదానీ రూపంలో దేశాన్ని మోదీ కట్టు బానిసను చేస్తున్నారని ఆరోపించారు రేవంత్. రైతు చట్టాలపై కాంగ్రెస్ పోరాడిందని గుర్తు చేశారు. ఆదానీ కుంభకోణంపై పార్లమెంటులో చర్చ జరగకుండా విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారని అన్నారు రేవంత్. ఒక ప్రయివేటు సంస్థ లక్షల కోట్ల ప్రజా ధనాన్ని లూఠీ చేస్తే.. ఈడీకి పిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ వెళితే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు రేవంత్.. ఇది ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అభివర్ణించారు. దీని వెనక అసలు సంగతి ఏమిటో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ హయాంలో బొగ్గు కుంభకోణం, 2జీ, కామన్ వెల్త్ గేమ్స్ పై జేపీసీని నియమించింది. పారదర్శక విచారణ జరగడానికి సహకరించింది. ఆదానీ షేర్ల విలువ కృత్రిమంగా పెంచి మోదీ ఎల్ఐసీ, ఎస్బీఐ నుంచి లక్ష కోట్లు పెట్టుబడి పెంచారు. 10 లక్షల కోట్లు పేదల సొమ్ము కొల్లగొట్టారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఒక వ్యక్తిని కాపాడేందుకు కేంద్రం ఎందుకు ప్రయత్నం చేస్తోందని అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసైకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అడ్డు తగిలి అరెస్టులు చేసిందన్నారు రేవంత్. వినతిపత్రం ఇవ్వడానికి వెళితే మా సీఎల్పీ నేతను ఎందుకు పోలీసులు అడ్డుకున్నారని ప్రశ్నించారు.
ఈ దేశంలో పేదలతో పెట్టుబడులు పెట్టించి.. హవాలా రూపంలో ఇతర దేశాలకు తరలించిందని నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రంలో, ఢిల్లీలో కాంగ్రెస్ నేతల అరెస్టుతో అదానీ, ప్రధాని మోదీ చీకటి ఒప్పందం బయటపడిందని అన్నారు రేవంత్ రెడ్డి. అదానీ , ప్రధాని మోదీ వేరు వేరు కాదని అన్నారు. అదానీయే ప్రధాని... ప్రధానినే అదానీ అని సెటైర్లు వేశారు. మోదీ చెప్పిన డబుల్ ఇంజన్ సర్కారు ఇదే.. అదానీ కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. జీపీసీని నియమించి బీజేపీ తమ నీతిని నిరూపించుకోవాలని అన్నారు.
కామారెడ్డిలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్
తెలంగాణ, నిజామాబాద్ లో అభివృద్ధి చేసిందే కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో 30వేలు, వెయ్యి జూనియర్ కాలేజీలు, 100 డిగ్రీకాలేజీలు, 11 యూనివర్సిటీలు ఏర్పాటు చేసింది. కేసీఆర్, కేటీఆర్ చదువుకున్న పాఠశాలలు నిర్మించింది కూడా కాంగ్రెస్ పార్టీ యే అన్నారు రేవంత్ రెడ్డి. మేం తెలంగాణ ఇచ్చినందుకే కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యారని అన్నారు రేవంత్ రెడ్డి.
24 గంటల కరెంటు ఈ ప్రభుత్వం ఇస్తుందని నిరూపిస్తే.. దేనికైనా సిద్ధమని అన్నారు. మీరేం చేశారో.. మేమేం చేశామో మీడియా మిత్రుల సమక్షంలో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. మేం ఏమేం చేశామో నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టమీదైనా.. ఇంకెక్కడైనా మాట్లాడేందుకు సిద్ధం అని అన్నారు రేవంత్ రెడ్డి. బీఆరెస్ చేసింది.. 30వేల వైన్ షాపులు.. 60వేల బెల్ట్ షాపులు పెట్టడం మాత్రమే అని అన్నారు. అంతకు మించి రాష్ట్రానికి బీఆర్ఎస్ చేసిందేం లేదన్నారు రేవంత్ రెడ్డి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement