అన్వేషించండి

Telangana University : ఇకనైనా తెలంగాణ యూనివర్సిటీలో వివాదాలు సద్దుమణగుతాయా? 

Telangana University : తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎప్పుడూ వివాదాల్లోనే నిలుస్తోంది. ఇకనైనా ఆ సమస్యలు తొలుగుతాయా లేదా..?

Telangana University : తెలంగాణ యూనివర్సిటీ ప్రారంభం నుంచి ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటూ వస్తోంది. ఉన్నత విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన విశ్వవిద్యాలయం వివాదాలకు నిలయంగా మారింది. వర్సిటీలో సిబ్బంది వర్గాలుగా చీలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. అక్రమ నియామకాలు, వర్సిటీలో సమస్యలు పట్టించుకోక పోవటం, నిత్యం రిజిస్ట్రార్ల మార్పులు అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

అధికారుల మధ్య సమన్వయం లోపించి ఏడాదిన్నర కాలంగా సమావేశాలు లేక వర్సిటీలో ఏం జరిగిందో తెలియని పరిస్థితి. వారం కింద జరిగిన భేటీలో అనూహ్య నిర్ణయాలతో అందరిని ఆశ్చర్య పరిచింది పాలక మండలి. తాజాగా మరోమారు జరిపిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. వీసీపైనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానించడం, ఇన్ఛార్జి రిజిస్ట్రార్ గా ఉన్న ప్రొఫెసర్ విద్యా వర్ధినిని సస్పెండ్ చేశారు. వీసీపై ఏసీబీ విచారించాలని నిర్ణయించడం సంచలన నిర్ణయమే. అకడమిక్ కన్సల్టెంట్ విధుల్లో నుంచి తొలగింపు నిర్ణయంతో పాటు వారం రోజుల్లోనే పదోన్నతుల రద్దు, అడ్వాన్సులు తీసుకున్న వారికి రికవరీ నోటీసుల జారీ వంటి నిర్ణయాలు జరిగిపోయాయి.

2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఇంకా బడ్జెట్ ఆమోదం పొందలేదు. రెండు సమావేశాల్లో దీనిపై చర్చించినా చేసిన ఖర్చులకు సరైన లెక్కలు లేవని అధికారులు సమాధానం ఇచ్చారు. గడిచిన 8 నెలల కాలంలో వివిధ కార్యక్రమాల పేరిట పెద్ద మొత్తంలో వ్యయాలు చేసినట్లు వివరించారు. ఎక్కువ మొత్తం నోట్ ఫైల్ లేకుండా డబ్బులు డ్రా చేయటం జరిగిందని చెప్పారు. వీటిని ఏ ప్రాతిపదికన చేశారు? ఇప్పుడెలా లెక్క చూపాలి? అన్నది తేలాల్సి ఉందన్నారు. చెల్లింపుల విషయంలో నిబంధనలు పాటించలేదని వివరించారు. దీంతో మళ్లీ బడ్జెట్ పక్కకు పెట్టారు. దీనికి ఆమోదం లభిస్తేనే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 పద్దు ప్రతిపాదనల ఆమోదంపై ముందుకెళ్లాల్సి ఉంటుంది. దీంతో రెండు బడ్జెట్లపై పీటముడి వీడలేదు. సమస్యను అధిగమించేందుకు నిధుల దుర్వినియోగం అంశంపై విచారణ పూర్తిచేయాలని నిర్ణయించింది.

నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఖర్చులపై విచారించేందుకు ఐదుగురి సభ్యుల కమిటీ వర్సిటీకి రానుంది. బడ్జెట్ ఆమోదం లేకుండా ఎంత ఆర్థిక వ్యయాలు చేశారు? అందులో నోట్ ఫైల్ లేకుండా ఎన్ని ఉన్నాయి? వాటిని ఎందుకు చేశారో? పరిశీలించనున్నారు. ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి చంద్రకళ నేతృత్వంలో కమిటీ ఆయా అంశాలు పరిశీలించనుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఫైళ్ల ఆధారంగా సిద్ధం చేయాలని ఇప్పటికే రిజిస్ట్రార్ కు సూచించింది. సిబ్బంది ద్వారా కొంత సమాచారం సిద్ధం చేసినట్లు సమాచారం. వీటిల్లో కీలకంగా ఉత్తర్వులు లేకుండా జరిపిన చెల్లింపులు, వర్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు చేసిన ఖర్చులున్నాయి. వీటిపై వివరాలు సేకరించి చెక్కులు తయారు చేయటానికి ఉన్న నిబంధనలు పాటించారా? ఆ చెక్కును అనుమతిస్తూ సంతకాలు చేసేప్పుడు సరి చూశారా? అనే విషయాలు కీలకం కానున్నాయి.  పాలక మండలిలో వీసీకి మిగతా సభ్యులకు పోసగకపోవటం... ఇష్టారీతిలో జరిగిన అక్రమ నియామకాల బాగోతం వర్సిటీ పరువు దిగజారుతోంది. వర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిని ఇకనైనా సమస్యల పరిష్కారం పై దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget