అన్వేషించండి

Asifabad Latest News: తెలంగాణవ్యాప్తంగా కార్డుల పంపిణీలో గందరగోళం- రోజుకో ప్రాంతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పంచాయితీ

Asifabad Latest News:తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారుతోంది. కాంగ్రెస్ బీఆర్‌ఎస్ నేతల మధ్య ప్రోటోకాల్ పంచాయితీ, మాటల తూటాలు పీక్స్‌కు చేరుతున్నాయి.

Telangana Latest News: తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. దీన్ని వేదికగా చేసుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఫైటింగ్కు దిగుతున్నారు. రాష్ట్రంలో ఏదో చోట ఏదో రగడ సాగుతోందీ.మొన్న మహేశ్వరంలో గొడవ జరిగితే ఇవాళ కుమ్రం భీం ఆసిఫాబాద్లో గందరగోళం నెలకొంది. దీనిపై బీఆర్ఎస్ఫైర్ అవుతోంది. అధికార పార్టీ ఎక్కడా ప్రోటోకాల్పాటించడం లేదని మండిపడుతోంది. అనవసరమైన విమర్శలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు.

ఆసిఫాబాద్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వార్

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జరిగిన గందరగోళం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఎమ్మెల్యే కోవలక్ష్మీ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యాం నాయక్పై వాటర్ బాటిల్తో కొట్టేంత వరకు పరిస్థితి వెళ్ళింది.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్లో గల రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ రేషన్ కార్డుల పంపిణీకి ఎమ్మెల్యే కోవలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీర శ్యాం నాయక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ డేవిడ్ మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు రాలేదని అనగా.. ఎమ్మెల్యే ఒక అధికారిగా అలా మాట్లాడవద్దని వారించారు. అలా మొదలైన వివాదం చివరకు ఘర్షణకు దారి తీసింది.

ఎమ్మెల్యే కోవలక్ష్మీ మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులను చెప్పారు. ఆమెను ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యామ్ నాయక్ అడ్డుకున్నారు. గత ప్రభుత్వ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. దీంతో శ్యాం నాయక్, ఎమ్మెల్యే కోవలక్ష్మి మధ్య మాట మాట పెరిగి రసాబాసకు దారి తీసింది. ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఈ క్రమంలో శ్యాం నాయక్ను ఎమ్మెల్యే కోవలక్ష్మీ ,వాటర్ బాటిల్తో కొట్టే వరకు వెళ్ళింది.

కంగుతన్న శ్యాంనాయక్, ఆయన అనుచరులు ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు యత్నించారు. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా శ్యాం నాయక్ అనుచరులు నినాదాలు చేశారు. శ్యాంనాయక్ మాట్లాడుతూ.. తనపై బాటిల్తో దాడి చేయడం సరికాదని, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం ఆమెతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

శ్యాంనాయక్ఆరోపణలై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఘాటుగా స్పందించారు. ఎలాంటి ప్రొటోకాల్ లేని వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు శ్యాం నాయక్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ మహిళ అని చూడకుండా కిరాయి మనుషులతో భయపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఇలాంటి వారికి కాంగ్రెస్ అధిష్ఠానం బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.

మహేశ్వరంలో ప్రోటోకాల్ రగడ 

రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. బాలాపూర్మండలంలో రేషన్ కార్డుల పంపిణీలో ఘటన జరిగింది. మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్న కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డితోపాటు బీఆర్ఎస్ నేతలు చాలా మంది పాల్గొన్నారు. వాళ్లెవ్వరి విషయంలో కూడా ప్రోటోకాల్ పాటించలేదని సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు. కాంగ్రెస్లో ఎలాంటి పదవులు లేని వాళ్లకు మర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

ఎక్కడ కూడా కాంగ్రెస్ పాలనలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ నేతలను అవమానిస్తున్నారని గులాబీ నాయకులు మండిపడుతున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమ ప్రాంతంలో జరిగే అధికారిక కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు మాదిరిగా చేయం ఏంటని నిలదీస్తున్నారు. కేసులు పెట్టడం నుంచి ప్రోటోకాల్ ఉల్లంఘనల వరకు అన్నింటినీ ప్రజలు చూస్తున్నారని కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Bandi Sanjay vs Etala Rajender: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
Embed widget