అన్వేషించండి

Nirmal Master Plan: ‘మాస్టర్‌ ప్లాన్‌’పై ఎలాంటి అపోహలు వద్దు - రైతుల‌తో మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి 

నిర్మల్ మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‌ విషయంలో రైతులకు ఎలాంటి ఆపోహ వ‌ద్దని, ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

- రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటాం
- రైతుల‌తో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

నిర్మల్ మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‌ విషయంలో రైతులకు ఎలాంటి ఆపోహ వ‌ద్దని, ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మున్సిపల్‌ పరిధిలోని వివిధ గ్రామాల‌కు చెందిన రైతులు హైదరాబాదులోని అర‌ణ్య భ‌వ‌న్ లో మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డిని క‌లిశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుంద‌ని,  రైతుల‌కు వ్యతిరేఖంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డ్రాఫ్ట్ ల‌ను నిలిపివేసింద‌ని, నిర్మల్  మాస్టర్‌ ప్లాన్‌ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. డ్రాప్ట్ పై రైతులు ఇచ్చిన వినతులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామ‌ని స్పష్టం చేశారు. మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డిని క‌లిసిన వారిలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్ ఆదుముళ్ళ పద్మాకర్, మాజీ కౌన్సిలర్ చెనిగారపు నరేష్, కౌన్సిలర్ తారక రఘు, రైతులు కొట్టే శేఖర్, దోంతుల రవి, గంగయ్య, అనుముల మోహన్, కత్రోజి గణేష్, కూన ఈశ్వర్, ద్యాగా దేవిదాస్, రాంచందర్ తదితరులు ఉన్నారు.

విచారణను ఫిబ్రవరి 13 కు వాయిదా 
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు జవవరి చివరి సోమవారం విచారణ చేపట్టింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేఏ పాల్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యి వాదనలు వినిపించారు. రైతులను సంప్రదించకుండానే మాస్టర్ ప్లాన్ రూపొందించారని కోర్టుకు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసినట్టు కౌన్సిల్ ప్రకటించిందన్నారు. అయితే కౌన్సిల్ కు నిర్ణయం తీసుకునే అధికారం లేదని, మాస్టర్ ప్లాన్ రద్దు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కేఏ పాల్ అన్నారు. ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వం   నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వ నిర్ణయాన్ని ఫిబ్రవరి 13 లోపు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఫిబ్రవరి 13 కు వాయిదా వేసింది.  కామారెడ్డిలోని కొన్ని గ్రామాల పొలాలను ఇండస్ట్రియల్‌ జోన్‌ పరిధిలోకి తెచ్చారని బాధిత రైతులు ఇటీవల ఆందోళన చేశారు. మాస్టర్‌ ప్లాన్‌లో సాగు భూములను పరిశ్రమల జోన్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు కూడా చేశారు. 

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ నోటిఫికేషన్  
 కొద్ది రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అవుతున్న కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశానికి ఇటీవల మున్సిపల్ కమిషనర్ ముగింపు పలికారు. ఈ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  కౌన్సిలర్లు అందరూ రాజీనామా చేయాలని రైతులు ఒత్తిడి చేస్తుండటంతో ఒక్కొక్కరుగా రాజీనామాలు చేశారు. దీంతో అందరూ రాజీనామా చేసే అవకాశం ఉండటంతో.. అధికారులు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget